Tuesday, September 8, 2026 08:30 PM
Tuesday, September 8, 2026 08:30 PM

వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి చిన్న శ్రీను..!

స్థానిక సంస్థల ఎన్నికల ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపిన చిన్న శ్రీను.. పార్టీ పదవులకు కూడా గుడ్‌ బై చెప్పారు. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, భీమిలి సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో స్పష్టం చేశారు.

Also Read : బిగ్ టీవీలో బిగ్ బాంబ్.. సజ్జల గారి 60 కోట్ల ఫేక్ టాస్క్..!

ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్న చిన్న శ్రీను.. టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చిన్న శ్రీను టీడీపీలో చేరికతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశాలున్నాయి. బొత్స కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న ఆయన వైసీపీని వీడటం ఆ పార్టీకి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బొత్స కుటుంబం విజయనగరంలో ఆధిపత్యం చెలాయించడంలో, రాజకీయాల్లో రాణించడంలో చిన్న శ్రీను కీలక పాత్ర పోషించారు. జిల్లాలో బొత్స తరఫున రాజకీయాలు చక్కబెట్టారు. అలాంటి చిన్న శ్రీను బొత్సకు దూరం కావడం.. రాజకీయంగా కొలుకోలేని దెబ్బ.

Also Read : డీఎస్సీ వార్.. ఆరోపణలు సరే.. ఆధారాలేవి..?

కొన్నాళ్లుగా బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్న మాట బహిరంగ రహస్యం. ఇందుకు ప్రధాన కారణం.. జిల్లాలో బొత్స కుటుంబ సభ్యులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ రేసులో తన కుమార్తె ఉన్నట్లు బొత్స ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. ఇది కూడా చిన్న శ్రీను ఆగ్రహానికి కారణంగా మారింది. గతంలో జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా పని చేసిన చిన్న శ్రీను.. మరోసారి ఆ పదవి ఆశిస్తున్నట్లు సన్నిహితుల మాట. కానీ బొత్స మాత్రం.. రేసులో తన కుమార్తె ఉన్నారని చెప్పడం చిన్న శ్రీను ఆగ్రహానికి కారణమంటున్నారు. అందుకే టీడీపీ అధినేత సమక్షంలో పసుపు కండువా కప్పుకునేందుకు చిన్న శ్రీను సిద్ధమై ఈరోజు చంద్రబాబు సమక్షంలోనే టిడిపి కండువా కప్పుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు కూడా బయటకు...

తెలంగాణ బాపు అని గొప్ప బిరుదు.....

వైఎస్ వివేకా హత్య...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య...

లోకల్ వార్.. ఎవరికి...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు...

మెగా ఫ్యామిలీకి వరుసగా...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర...

ఎల్పీజీ వినియోగదారులకు గుడ్...

ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కేంద్ర...

కేసీఆర్ ఫామ్‌హౌస్‌ కు...

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా మునుపెన్నడూ లేని...

పోల్స్