Tuesday, September 8, 2026 03:35 PM
Tuesday, September 8, 2026 03:35 PM

మెగా ఫ్యామిలీకి వరుసగా కీలక పదవులు..!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెలను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాల మెరుగుదలతో పాటు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక ఉత్సవాల్లో సుస్మిత కొణిదెల భాగస్వామ్యమై అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందిస్తారని ప్రభుత్వం పేర్కొంది.

Also Read : కేసీఆర్ ఫామ్‌హౌస్‌ కు పోలీసులు.. అసలేం జరుగుతుంది..?

సినిమా నిర్మాణ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న సుస్మితకు ఈ బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మెగా కుటుంబానికి ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్న క్రమంలోనే ఈ తాజా నియామకం జరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ నియమితులైన సంగతి తెలిసిందే.

Also Read : మైండ్ గేమ్ ఆడుతున్న మేధావులు..!

అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో మెగా కుటుంబానికి ఆధ్యాత్మిక మరియు ప్రభుత్వ రంగాలలో వరుసగా సముచిత స్థానం కల్పిస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీకి దక్కుతున్న పదవుల పరంపరలో ఇది మరో కీలక అడుగు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆయన సోదరుడు కొణిదెల నాగబాబుకు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా కీలక పదవి దక్కింది. ఇప్పుడు తాజాగా చిరంజీవి కుమార్తె సుస్మితకు కూడా ప్రముఖ క్షేత్రమైన దుర్గగుడి బోర్డులో స్థానం దక్కడంతో మెగా అభిమానులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైఎస్ వివేకా హత్య...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య...

లోకల్ వార్.. ఎవరికి...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు...

ఎల్పీజీ వినియోగదారులకు గుడ్...

ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కేంద్ర...

కేసీఆర్ ఫామ్‌హౌస్‌ కు...

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా మునుపెన్నడూ లేని...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను వేటాడిన...

తెలంగాణ శాసనసభ వేదికగా సోమవారం చోటుచేసుకున్న...

డీజీపీ మాటను లెక్క...

స్వయంగా పోలీస్ బాసు రంగంలోకి దిగారు....

పోల్స్