Monday, September 7, 2026 07:02 PM
Monday, September 7, 2026 07:02 PM

మైండ్ గేమ్ ఆడుతున్న మేధావులు..!

మేము మేధావులం అని చెప్పుకునే కొందరు సీనియర్లు.. తమ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. నాణెనికి రెండు వైపులు చూపించాల్సిన గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న పాత్రికేయులు కూడా.. ఒక పార్టీకి భజన చేస్తున్నారు. ఈ విషయం వారు చేస్తున్న ఆరోపణలు, వాళ్లు చెబుతున్న విశ్లేషణలతోనే స్పష్టం అవుతుంది. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కోసం, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఈ సో కాల్డ్ మేధావులు పని చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. కేసీఆర్ కోసం హైదరాబాద్ ఆంధ్రోళ్లు ఉన్నారంటారు. వైఎస్ జగన్ కోసం అయితే.. కమ్మోళ్లు అంటూ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు నానా పాట్లు పడుతున్నారు.

AndhraNews9: నటి త్రిష వివాదంపై విజయ్ సంచలన కామెంట్స్..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు దాటింది. అయినా సరే.. ఇప్పటికీ కొందరు ప్రాంతీయ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతూనే ఉన్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా బీఆర్ఎస్, టీఆర్ఎస్ నాయకులతో పాటు మేధావుల ముసుగు వేసుకున్న కొందరు జర్నలిస్టులు కూడా వీరికి తోడయ్యారు. తెలంగాణ బాపు అని చెప్పుకునే కేసీఆర్ కోసం ఈ మేధావులంతా ఇప్పుడు ఏకమయ్యారు. చివరికి మహబూబ్‌నగర్ జిల్లాలో పుట్టి, పెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఇప్పుడు కొందరు ఆంధ్రోడు అనేస్తున్నారంటే.. వాళ్ల పైత్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. తెలంగాణ విషయంలో ఆంధ్రోళ్లు.. అని.. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కమ్మోళ్లు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Also Read : చంద్రబాబు సొంత జిల్లాకు పవన్ గిఫ్ట్..!

తెలంగాణలో ఆంధ్రోళ్లను బీఆర్ఎస్ కోసం, ఏపీలో కమ్మరోళ్లను జగన్ అండ్ కో కోసం తెర పైకి తీసుకువచ్చారు. ఒకరిది కులం ఏడుపైతే.. మరొకరిది సెంటిమెంట్ బాధ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత జైలు నుంచి వచ్చి… కొత్తగా టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఆంధ్రోళ్లు అంటూ విషం చిమ్ముతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారు.

Also Read : ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్.. ఫలించిన పవన్ కృషి

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాలు స్పోర్ట్స్ కోటాలో నిబంధనలకు విరుద్ధంగా కమ్మోళ్లకు ఇచ్చారని వైసీపీ అభిమాన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు. అయితే ఆధారాలు చూపమంటే, తప్పు చేశానని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కవిత కూడా ఆంధ్రోళ్లు అని ప్రాంతీయతను రెచ్చగొడుతున్నారు. బీఆర్ఎస్ అభిమానులైన జర్నలిస్టులు, మేధావులు కూడా ఆంధ్రోళ్లు అని కామెంట్లు చేస్తూనే వున్నారు. అయితే వారి దృష్టిలో జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ మాజీ మంత్రులు, ఆ పార్టీ నాయకులు ఆంధ్రోళ్లు కారేమో.

కొస మెరుపు ఏమిటంటే.. అటు వైసీపీ నాయకులు, ఇటు బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ నేత కవిత కూడా, కమ్మోళ్లు అని ఏడుస్తూనే వున్నారు. మా దగ్గరకు కమ్మోళ్లు రావద్దు అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కూడా సొంత వారిని దూరం పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో కమ్మోళ్లు అందరికీ కాని వారయ్యారనే మాట ఎదుర్కొంటున్నారు. వారిని శత్రువులుగా చూస్తున్నారన్నటంలో సందేహం లేదు. అక్కడ కమ్మోళ్లు, ఇక్కడ ఆంధ్రోళ్లు చేసిన తప్పులేమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. వైసీపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్‌లో కమ్మోళ్లు, ఆంధ్రోళ్లు లేరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

డీజీపీ మాటను లెక్క...

స్వయంగా పోలీస్ బాసు రంగంలోకి దిగారు....

యుద్ధం కోసం ఉక్రెయిన్...

రష్యాతో సాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి అవసరమైన...

బ్రేకింగ్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో...

సోషల్ మీడియాలో లగ్జరీ లైఫ్‌స్టైల్ వీడియోలతో...

నటి త్రిష వివాదంపై...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులతో ముఖ్యమంత్రి...

ఫోటోలు ఫ్లెక్సీల కోసం...

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. జరుగుతోన్న...

చంద్రబాబు సొంత జిల్లాకు...

సిఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా...

పోల్స్