Monday, September 7, 2026 07:14 PM
Monday, September 7, 2026 07:14 PM

డీజీపీ మాటను లెక్క చేస్తారా.. లేదా..?

స్వయంగా పోలీస్ బాసు రంగంలోకి దిగారు. మరోసారి ఇలా జరిగితే.. ఇలా ఎక్కడైనా జరిగినట్లు తెలిస్తే.. ఎవరైనా చేసినట్లు తెలిస్తే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ముందు ఓ డ్రైవ్ నిర్వహించాలని పోలీసు శాఖను ఆదేశించారు. కమిషనర్లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. కానీ.. ఇది క్షేత్రస్థాయిలో అమలు అవుతుందా.. అసలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.. డీజీపీ మాటను లెక్క చేస్తారా..? ఆయన వార్నింగ్‌కు భయపడతారా..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొందరు ట్రాన్స్‌జెండర్ల తీరుపై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. వారు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే ఎన్నోసార్లు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ.. ఫలితం మాత్రం శూన్యం.

Also Read : చంద్రబాబు సొంత జిల్లాకు పవన్ గిఫ్ట్..!

ఒక శుభకార్యం జరుగుతుందని తెలిస్తే చాలు.. ఇంటి ముందు పందిరివేయటం పాపం.. ఒక షాపు ప్రారంభోత్సవం అయినా సరే.. చివరికి చావు అయినా సరే.. దేనిని కొందరు ట్రాన్స్‌జెండర్లు వదలటం లేదు. గృహప్రవేశం, పెళ్లి, ఓణీల పేరంటం, సీమంతం.. ఇలా ఏదైనా సరే.. మేము ఆశీర్వదీస్తాం.. మాకు దక్షిణ ఇవ్వండి అంటూ వస్తారు. ఇచ్చింది తీసుకుని పోవటం లేదు. డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని చింతల్‌లో ఓ గృహ ప్రవేశ వేడుకలో ట్రాన్స్‌జెండర్లు చేసిన రచ్చ వీడియో.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. గృహప్రవేశం జరగాలంటే.. రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి రూ.35 వేలు ఇచ్చే వరకు అక్కడ నుంచి కదల్లేదు. ఆ ఇంటి యజమానిని, బంధువులను బెదిరించారు. శాపనార్థాలు పెట్టారు. చివరికి వారిని వదిలించుకునేందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది.

Also Read : జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతున్న తెలంగాణా బస్ కండక్టర్..!

ఈ వ్యవహారం మొత్తం వీడియో తీసిన బాధితులు.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోరా.. అని పోలీసులను సూటిగా ప్రశ్నించారు. చివరికి ఈ వీడియో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వరకు చేరింది. దీంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. అన్ని కమిషనరేట్ల పరిధిలో తనిఖీలు చేపట్టాలని పోలీసులను సూచించారు. కొందరు ట్రాన్స్ జెండర్లు శుభకార్యాల వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి బెదిరింపులు, దోపిడీలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్ని కమిషనరేట్ల సీపీలను ఆదేశించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Also Read : గుహలోంచి బయటకొచ్చిన కూన.. సింహంగా అడుగుపెడుతున్న మోక్షజ్ఞ!

ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా జీవించేలా.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. వారిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, హైడ్రా విధుల్లోకి తీసుకుని ప్రొత్సహిస్తోంది కూడా. అక్కడ బాధ్యతలు చేపట్టిన వారంతా.. ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నారని డీజీపీ సీవీ ఆనంద్ గుర్తు చేశారు. ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ.. ఇలా బెదిరింపులు, అసాంఘిక కార్యకలాపాలు, దందాలకు పాల్పడటం ఏమిటని డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొందరు ట్రాన్స్‌జెండర్ల మాట మాత్రం మరోలా ఉంది. కొందరు నకిలీ ట్రాన్స్‌జెండర్ల వల్ల తమకు చెడ్డ పేరు వస్తుందన్నారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

యుద్ధం కోసం ఉక్రెయిన్...

రష్యాతో సాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి అవసరమైన...

బ్రేకింగ్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో...

సోషల్ మీడియాలో లగ్జరీ లైఫ్‌స్టైల్ వీడియోలతో...

నటి త్రిష వివాదంపై...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులతో ముఖ్యమంత్రి...

ఫోటోలు ఫ్లెక్సీల కోసం...

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. జరుగుతోన్న...

చంద్రబాబు సొంత జిల్లాకు...

సిఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా...

జాతీయ స్థాయిలో ట్రెండ్...

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో...

పోల్స్