మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. జరుగుతోన్న లీడర్షిప్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం అయినప్పటి నుంచి నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చామని ఆయన పేర్కొన్నారు. అనేక ప్రాజెక్టులకు నేనే శంకుస్థాపనలు చేశానని, పోలవరం కోసం ప్రధాని మోదీతో మాట్లాడి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించామని తెలిపారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది. మనం దాన్ని గాడిన పెట్టామని తెలిపారు.
Also Read : చంద్రబాబు సొంత జిల్లాకు పవన్ గిఫ్ట్..!
గోదావరి పుష్కరాలకు ముందే ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు చంద్రబాబు. వెలిగొండ ప్రారంభించిన తర్వాత కృష్ణా జలాలను చూసి అక్కడి ప్రజల కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయని, వెలిగొండ ప్రారంభించడంతో నా జన్మ ధన్యమైందని పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకెళ్లాం. ప్రతి ఎకరాకూ జలహారతి ఇస్తామని స్పష్టం చేసారు. నదుల అనుసంధానం జరగాలి… దీనికోసం 30 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాం… నాటి ప్రధాని వాజ్ పేయితో చెప్పి టాస్క్ ఫోర్స్ వేయించానన్నారు.
Also Read : ఏపిలో కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!
నదుల అనుసంధానం జరిగితే నీటి యుద్ధాలు తగ్గుతాయని, ఎల్ నినో విపత్తుపై అందరూ అప్రమత్తంగా ఉండాలని, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఎల్ నినోపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు చంద్రబాబు. మనం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి. భోగాపురం ఎయిర్ పోర్టు, వెలిగొండ, పోలవరం ఎడమ కాల్వ ప్రారంభోత్సవాల్లో ప్రజలు భాగస్వాములయ్యారని.. ఎమ్మెల్యేల కోసం నియోజకవర్గాల్లో పరిపాలన వెసులుబాటు కోసం ప్రత్యేకంగా ఓ ఆఫీస్, 9 మంది సిబ్బందిని ఇచ్చామన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీ విజన్ ప్లాన్ ఇచ్చామని తెలిపారు. పార్టీ బలోపేతం కావాలంటే కార్యకర్త బలంగా ఉండాలని, రాజకీయ పార్టీగా బలపడడం ఎంత ముఖ్యమో… కూటమి ఐక్యత కూడా అంతే ముఖ్యమన్నారు సిఎం. ఫొటోల గురించి.. ఫ్లెక్సీల గురించి గొడవలు పడొద్దన్నారు. కూటమిగా క్షేత్రస్థాయికి కలిసి వెళ్లాలని సూచించారు.

