Monday, September 7, 2026 05:29 PM
Monday, September 7, 2026 05:29 PM

యూరప్ కు భారత్ దిక్కు అయిందా..?

ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదనంతర ఆంక్షల వల్ల చమురు కొరతతో కొట్టుమిట్టాడుతున్న ఐరోపా దేశాలకు ఇప్పుడు భారతదేశం ప్రధాన ఇంధన వనరుగా మారుతోంది. అంతర్జాతీయంగా సముద్ర రవాణా మార్గాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, భారత్ నుండి యూరప్‌కు డీజిల్ సరఫరా భారీగా కొనసాగుతుండటం గమనార్హం.

Also Read : ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్.. ఫలించిన పవన్ కృషి

ఇటీవలి గణాంకాల ప్రకారం.. గడిచిన ఆగస్టు నెలలో వ్యూహాత్మక సముద్ర మార్గమైన బాబ్‌ ఎల్‌ మండేబ్‌ గుండా రోజుకు సగటున 2 లక్షల బ్యారెళ్ల డీజిల్‌ యూరప్‌కు తరలిపోయింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌ను సైతం ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. ఈ మొత్తం సరఫరాలో ఏకంగా 60 శాతం వాటా భారతదేశానిదే కావడం విశేషం. మిగిలిన అంతర్జాతీయ దేశాల కంటే భారత్ అత్యధిక శాతంతో ఐరోపా మార్కెట్‌ను ముంచెత్తుతోంది. అటు యూరప్ లో.. ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల కారణంగా చమురు సంక్షోభం తీవ్రమవుతోంది.

Also Read : ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్.. ఫలించిన పవన్ కృషి

ఒకప్పుడు రష్యా వంటి దేశాలపై ఇంధనం కోసం పూర్తిగా ఆధారపడిన యూరప్ ఖండం.. ప్రస్తుత సంక్షోభ సమయాల్లో భారతీయ రిఫైనరీల వైపు మొగ్గు చూపుతోంది. ఎర్రసముద్రం ప్రాంతంలో భద్రతా ముప్పు పొంచి ఉన్నప్పటికీ, భారత్ ఈ రికార్డు స్థాయి సరఫరాను అందుకోవడం ద్వారా ప్రపంచ ఇంధన భద్రతలో తనదైన ముద్ర వేస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో యూరప్ దేశాల ఇంధన అవసరాలకు భారత్ మరింత కీలకమైన ఆశాకిరణంగా మారనుందని స్పష్టమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

యుద్ధం కోసం ఉక్రెయిన్...

రష్యాతో సాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి అవసరమైన...

బ్రేకింగ్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో...

సోషల్ మీడియాలో లగ్జరీ లైఫ్‌స్టైల్ వీడియోలతో...

నటి త్రిష వివాదంపై...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులతో ముఖ్యమంత్రి...

ఫోటోలు ఫ్లెక్సీల కోసం...

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. జరుగుతోన్న...

చంద్రబాబు సొంత జిల్లాకు...

సిఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా...

జాతీయ స్థాయిలో ట్రెండ్...

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో...

పోల్స్