Tuesday, September 8, 2026 06:28 PM
Tuesday, September 8, 2026 06:28 PM

ఇప్పుడు కూడా బయటకు రారా దొరా..?

తెలంగాణ బాపు అని గొప్ప బిరుదు.. తెలంగాణ కోసం చావు నోట్లో తల పెట్టిన గొప్ప నేత.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఆయన వల్లే జరిగిందనే ప్రచారం.. ఇవన్నీ భారత రాష్ట్ర సమితి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పే మాటలు. అదే సమయంలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కేసీఆర్ బిడ్డలే అని గొప్పగా చెప్తారు. కానీ.. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి. అయినా సరే.. ఈ బాపు నోరు మాత్రం ఇప్పటి వరకు మెదపలేదు. అసలు కేసీఆర్‌కు ఏమైంది.. ఉన్నారా.. లేరా.. అనే కనీస విషయం కూడా తెలియటం లేదు.

Also Read : ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్..!

తెలంగాణ సమావేశాల ప్రారంభం సందర్భంగా నల్ల చొక్కాలు వేసుకుని, ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు సభ బయటే అడ్డుకున్నారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాయలేని బాషలో మీడియా ముందు రెచ్చిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ఉదయం ఆయన నివాసంలో అరెస్టు చేశారు. సభ తొలిరోజు మొత్తం తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపైనే చర్చ జరిగింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కూడా.

రెండోరోజు అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాతా మధుకు మద్దతుగా నిలవడం పెద్ద దుమారం రేపింది. ఆయన స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. అలా ఎవరైనా అనుకుని ఉంటే.. బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధమని కూడా మధు తెలిపినట్లు మాజీ మంత్రి హరీష్ రావు సభలో వ్యాఖ్యానించడంపై స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాతా మధు తన తల్లిని దూషించారని.. మిమ్మల్ని అని ఉంటే.. ఆ బాధ మీకు తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితుల పట్ల బీఆర్ఎస్ నేతల చిత్తశుద్ధి ఇప్పుడు బయట పడిందన్నారు.

Also Read : వైఎస్ వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి సంచలనం..!

దళితులపై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ.. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. తాతా మధు పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎర్రబెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌ను కాంగ్రెస్ దళిత నేతలు, కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించారు. తాతా మధును వెంటనే పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ వద్ద కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అని.. గొప్పగా ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు దళితులకు ఏం సమాధానం చెప్తారని నిలదీస్తున్నారు.

దళిత ముఖ్యమంత్రి అని.. మాట తప్పితే తల తీసుకుంటా.. అని గొప్పగా ప్రకటించిన కేసీఆర్.. ఆ మాట తప్పి 12 ఏళ్లు అయినా కూడా.. ఇంకా తల తీసుకోలేదంటేని ప్రశ్నిస్తున్నారు. దళితులంటే తొలి నుంచి గులాబీ పార్టీ నేతలకు చిన్న చూపు ఉందని.. అందుకే కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని.. ఇప్పుడు కూడా ఎస్సీ అయిన గడ్డం ప్రసాద్ కుమార్‌ను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందనే సభకు రావటం లేదని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు తెలంగాణ బాపు అని చెప్పుకోవడమే తప్ప.. ఇప్పుడు కూడా బయటకు రాకపోతే ఎలా.. అని నిలదీస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైఎస్ వివేకా హత్య...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య...

లోకల్ వార్.. ఎవరికి...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు...

మెగా ఫ్యామిలీకి వరుసగా...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర...

ఎల్పీజీ వినియోగదారులకు గుడ్...

ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కేంద్ర...

కేసీఆర్ ఫామ్‌హౌస్‌ కు...

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా మునుపెన్నడూ లేని...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను వేటాడిన...

తెలంగాణ శాసనసభ వేదికగా సోమవారం చోటుచేసుకున్న...

పోల్స్