Friday, October 9, 2026 07:35 AM
Friday, October 9, 2026 07:35 AM

చెన్నై మాస్టర్ ప్లాన్.. ఓపెనింగ్ జోడీపై కీలక నిర్ణయం..!

ఈ ఏడాది ఐపిఎల్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. గత సీజన్‌ లో ఎదురైన పరాభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న సీఎస్కే, ఈసారి తన బ్యాటింగ్ లైనప్‌ ను పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. ముఖ్యంగా జట్టు ఓపెనింగ్ జోడీ విషయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌ లో తాను, టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్‌ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సంకేతాలు ఇచ్చాడు.

Also Read : ఆ రెండు జిల్లాలే పవన్ నయా టార్గెట్..!

గతంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌ గా ఉన్న సంజును సీఎస్కే మేనేజ్మెంట్ భారీ ధరకు దక్కించుకున్న నేపథ్యంలో, అతడిని ఓపెనర్‌గా పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఏడాది సీజన్ లో సిఎస్కే ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. దానికి ప్రధాన కారణం ఆ జట్టు టాప్ ఆర్డర్ వైఫల్యం. పవర్‌ ప్లేలో వేగంగా పరుగులు రాకపోవడం, వరుసగా వికెట్లు కోల్పోవడం సీఎస్కేను దెబ్బతీశాయి. రుతురాజ్ గైక్వాడ్‌ కు సరైన జోడీ కుదరకపోవడంతో మిడిల్ ఆర్డర్‌ పై విపరీతమైన ఒత్తిడి పడింది.

Also Read : బ్రేకింగ్: జగన్ కు పెమ్మసాని డెడ్లీ వార్నింగ్

అందుకే ఈసారి అటాకింగ్ గేమ్‌ ఆడే సంజు శామ్సన్‌ ను ఓపెనర్‌ గా బరిలోకి దింపడం ద్వారా ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాలని సీఎస్కే భావిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ క్లాస్ బ్యాటింగ్‌ తో ఇన్నింగ్స్‌ ను నిర్మిస్తుంటే, మరోవైపు సంజు శామ్సన్ తన పవర్‌ హిట్టింగ్‌ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలడు. ఈ ఇద్దరూ కుడిచేతి వాటం బ్యాటర్లే అయినప్పటికీ, వీరిద్దరి శైలి భిన్నంగా ఉండటం జట్టుకు కలిసి వచ్చే అంశం. వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా సంజు చేపట్టే అవకాశం ఉండటంతో, ఎం.ఎస్. ధోనీ రిటైర్మెంట్ తర్వాత జట్టులో ఏర్పడిన లోటును కూడా భర్తీ చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్