Friday, October 9, 2026 07:35 AM
Friday, October 9, 2026 07:35 AM

చికెన్ లివర్ తో ఫ్యాటీ లివర్ కు చెక్..?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒక పద్ధతి లేని ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఫ్యాటీ లివర్. అయితే, ఈ వ్యాధిని నయం చేసే దిశగా శాస్త్రవేత్తలు ఒక కీలక అడుగు వేశారు. సాధారణంగా లభించే విటమిన్ బి3(నియాసిన్) ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఫ్యాటీ లివర్ వ్యాధికి ప్రధాన సూత్రధారి ‘మైక్రోఆర్ఎన్ఏ-93’ అనే ఒక సూక్ష్మ అణువు అని తేలింది.

Also Read : షుగర్ లెవల్స్ పెరగకుండా కడుపు నిండాలా..? అయితే ఇది తినండి..!

ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న రోగులలో ఈ అణువు లెవెల్స్ అసాధారణంగా పెరిగిపోతాయని గుర్తించారు. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేయడమే కాకుండా, కాలేయ కణాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల్లో విటమిన్ బి3 లేదా నియాసిన్‌ను ఉపయోగించినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. నియాసిన్ శరీరంలోకి చేరాక, కాలేయంలో అసాధారణంగా పెరిగిన ప్రమాదకర అణువుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. కాలేయంలో కలిగే వాపు, కొవ్వు పేరుకుపోవడాన్ని నియాసిన్ అడ్డుకుంటుంది.

Also Read : బ్రేకింగ్: జగన్ కు పెమ్మసాని డెడ్లీ వార్నింగ్

దెబ్బతిన్న కాలేయ కణాలను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చడంలో ఈ విటమిన్ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధనలో తేలింది. మరి విటమిన్ బి3 ఎందులో దొరుకుతుంది..? మనం రోజువారీ తీసుకునే ఆహారంలోనే నియాసిన్ లభిస్తుందట. చికెన్, చేపలు, లివర్ వంటి వాటిల్లో ఇది ఉంటుంది. వేరుశనగలు, పుట్టగొడుగులు, పీచు ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, బఠానీలలో ఉంటుంది. అలాగే సన్ ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలలో కూడా ఇది సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ బి3 ఫ్యాటీ లివర్‌ను నయం చేయగలదని అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, సొంతంగా విటమిన్ సప్లిమెంట్లను వాడటం ప్రమాదకరం. నియాసిన్ మోతాదు ఎక్కువైతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, కాలేయ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే దీనిని వాడాలి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్