తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ విడదీయరాని బంధం ఉంటుంది. రీసెంట్‌గా దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కజగం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించగా.. ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన మరో ఇద్దరు స్టార్ హీరోల రాజకీయ ప్రయాణంపై కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో జోరుగా చర్చ సాగుతోంది. యంగ్ అండ్ వర్సటైల్ హీరో శివకార్తికేయన్, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్‌లకు సంబంధించిన తాజా పరిణామాలు తమిళ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపాయి.
Also Read : చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ లిస్ట్..? మున్సిపల్ ఎన్నికల ముందే..!
యంగ్ హీరో శివకార్తికేయన్ తన అభిమాన సంఘాల ప్రతినిధులతో చెన్నైలో నిర్వహించిన ఒక సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫ్యాన్స్ మీటింగ్‌కు అంచనాలకు మించి ఊహించని రీతిలో భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలిరావడం విశేషం. ఇంత పెద్ద ఎత్తున జనాలు మోహరించడంతో శివకార్తికేయన్ కూడా త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం తమిళ మీడియాలో ఊపందుకుంది. అయితే, ఈ సమావేశంలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు శివకార్తికేయన్ ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు.
Also Read : విజయనగరంలో వైసీపీ మెయిన్ వికెట్ డౌన్.. ఇప్పుడు జనసేన వంతు..!
కేవలం సేవా కార్యక్రమాలు, భవిష్యత్ సినిమాల గురించే చర్చించారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నప్పటికీ, ఇంత భారీ సభ వెనుక పొలిటికల్ స్కెచ్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, తమిళ చిత్ర పరిశ్రమలో మరో అగ్ర నటుడైన ధనుష్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు తెరవెనుక చకచకా పావులు కదుపుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ధనుష్ పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీ పేరు కూడా దాదాపు ఖరారైందంటూ చెన్నై పొలిటికల్ సర్కిల్స్ లో ఒక సంచలన పేరు చక్కర్లు కొడుతోంది. ధనుష్ తన పార్టీకి తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును పరిశీలిస్తున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. విజయ్ తరహాలోనే ధనుష్ కూడా యువతను టార్గెట్ చేస్తూ ఈ పేరును లాక్ చేసినట్లు తెలుస్తోంది.


