Friday, October 9, 2026 06:54 AM
Friday, October 9, 2026 06:54 AM

మెగా ఫ్యామిలీపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్..!

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. మెగా కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ పోస్ట్ షేర్ చేసారు. అన్నా లెజినోవా సోషల్ మీడియాలో కాస్త తక్కువగానే కనపడుతూ ఉంటారు. అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ చూసి మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, తన భర్త పవన్ కల్యాణ్‌ తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు.

Also Read : ఘోర ప్రమాదం.. కాలి బూడిదైన బతుకులు..!

తాను మెగా కుటుంబంలోకి అడుగుపెట్టి దాదాపు 15 ఏళ్లు కావస్తోందని అన్నా లెజినోవా గుర్తుచేసుకున్నారు. మొదట్లో ఇంత పెద్ద కుటుంబంలోకి వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది. అసలు ఇంతమందిలో నేను ఎలా ఇమడగలను..? ఎలా కలిసిపోగలను..? అని అర్థం కాలేదు.. అంటూ తన తొలిరోజుల అనుభవాలను పంచుకున్నారు. తెలుగు సంప్రదాయాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న బాంధవ్యాల గురించి తనకు ఏమీ తెలియదని ఆమె పేర్కొన్నారు. కానీ నా భర్త పవన్ కల్యాణ్ నాకు ప్రతి విషయంలో తోడుగా నిలిచారని కొనియాడారు.

Also Read : ఆ రెండు జిల్లాలే పవన్ నయా టార్గెట్..!

ఎవరిని ఎలా పిలవాలి..? ఎవరితో ఎలా ఉండాలి..? అనేది ఆయనే నాకు నేర్పించారన్నారు. ఆయన సహకారం వల్లే నేను ఈ కుటుంబంలో ఒక భాగం కాగలిగానని ఆమె రాసుకొచ్చారు. తనకు సొంతంగా సోదరులు లేరని, కానీ మెగా కుటుంబంలోకి వచ్చాక ఆ లోటు తీరిందన్నారు. చిరంజీవి, నాగబాబులో తాను తన అన్నయ్యలను చూసుకుంటున్నాను అని, వారిద్దరూ నన్ను చెల్లెలిలా ఆదరిస్తారని ఎమోషనల్ అయ్యారు. కాగా పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక, అన్నా లెజినోవా తరచూ మెగా ఫ్యామిలీ వేడుకల్లో కనిపిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్