క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరు యాషెస్ సిరీస్ త్వరలోనే భారత గడ్డపై జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కు రోజురోజుకూ ఆదరణ తగ్గుతుండటం, టీ20 లీగ్ల హవా పెరుగుతుండటంతో ఈ సుదీర్ఘ ఫార్మాట్ కు మళ్లీ పూర్వవైభవం తేవడానికి క్రికెట్ ఆస్ట్రేలియా ఒక సంచలన ప్లాన్ ను తెరపైకి తెచ్చింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఒక టెస్ట్ మ్యాచ్ ను భారత్లో తటస్థ వేదికగా నిర్వహిస్తే అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్ బర్గ్ అభిప్రాయపడ్డారు.
Also Read : 12 ఏళ్లలో తొలిసారి మోకరిల్లిన మోడీ..!
సాధారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల మధ్యే రొటేషన్ పద్ధతిలో జరిగే ఈ ఐదు టెస్టుల సిరీస్, ఒకవేళ ఇండియాలో జరిగితే అధికారికంగా యాషెస్ కౌంట్లోకి రాకపోయినప్పటికీ దానికి లభించే ఆదరణ వేరే లెవెల్లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశకు రానప్పటికీ, దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మరియు భారత క్రికెట్ నియంత్రణ మండలి లతో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు గ్రీన్ బర్గ్ స్పష్టం చేశారు. భారత్ లో ఉన్న భారీ క్రికెట్ ఫ్యాన్ బేస్ వల్ల ఈ ప్రతిష్టాత్మక పోరుకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన కమర్షియల్ క్రేజ్ వస్తుందని ఆస్ట్రేలియా బోర్డు అంచనా వేస్తోంది.
Also Read : కోడలిపై జోగి రమేష్ కుటుంబం గృహహింస
భారత క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే తమ వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే వారి ప్రతిష్టాత్మక బిగ్ బాష్ లీగ్ ప్రారంభ మ్యాచ్ ను చెన్నై వేదికగా నిర్వహించబోతున్నారు, భారత గడ్డపై ఒక బీబీఎల్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ లకు మాత్రమే ప్రస్తుతం మార్కెట్ బాగుందని, మిగిలిన జట్ల టెస్టులు ఇబ్బందుల్లో ఉన్నందున ఇలాంటి వినూత్న ప్రయోగాలు టెస్ట్ క్రికెట్ మనుగడకు ఎంతో అవసరమని క్రికెట్ ఆస్ట్రేలియా బలంగా నమ్ముతోంది.

