Saturday, July 25, 2026 08:01 PM
Saturday, July 25, 2026 08:01 PM

అమెరికా గ్లోబల్ వీసా బాంబ్.. ఆ తప్పు చేస్తే కుటుంబం మొత్తానికి నో-ఎంట్రీ..!

ప్రపంచంలో ఏ మూల కూర్చుని అమెరికా పౌరులను డిజిటల్ రూపంలో మోసం చేసినా.. ఇకపై ఊరుకునేది లేదని డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ ప్రభుత్వం తేల్చిచేప్పింది. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ విస్తరిస్తున్న సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లను సమూలంగా నిర్మూలించడమే ధ్యేయంగా సరికొత్త ‘గ్లోబల్ వీసా ఆంక్షల విధానాన్ని’ వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. తమ దేశ చట్టాలను ధిక్కరిస్తూ అమెరికన్లను వేటాడే శక్తులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సందర్భంగా సంచలన హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : ప్రభుత్వ బడుల్లో ‘NO ADMISSION’.. లోకేష్ విజన్ ఎఫెక్ట్

యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం అమలులోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు ముఖ్యంగా ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో అమాయకులను ఆకర్షించి ముంచేసే అంతర్జాతీయ ముఠాలను, ‘సెక్స్‌టార్షన్’ వంటి తీవ్రమైన డిజిటల్ వేధింపులకు పాల్పడే వారిని టార్గెట్ చేయనున్నాయి. ఈ కొత్త వీసా ఆంక్షల్లో అత్యంత కఠినమైన అంశం ఏమిటంటే, ఈ నిబంధనలు కేవలం సదరు నేరస్థుడికే కాకుండా వారి యొక్క తక్షణ కుటుంబ సభ్యులకు సైతం వర్తిస్తాయి. తమ పౌరుల నుంచి అక్రమంగా సంపాదిస్తున్న నిధులతో అంతర్జాతీయంగా అవినీతి, మనీ లాండరింగ్ మరియు హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి దారుణాలకు ఈ ముఠాలు పాల్పడుతున్నాయని మార్కో రూబియో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : కోడలిపై జోగి రమేష్‌ కుటుంబం గృహహింస

అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం, ప్రధానంగా చైనాకు చెందిన అంతర్జాతీయ క్రిమినల్ ఆర్గనైజేషన్స్ సరిహద్దులు దాటి ఈ తరహా ఆన్‌లైన్ దోపిడీలకు తెరలేపాయి. దీని కారణంగా గత కొద్ది కాలంలోనే అమెరికా పౌరులు దాదాపు 10 బిలియన్ డాలర్లకు పైగా సొమ్మును కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. విదేశాల నుంచి అమెరికాలోని చిన్న పిల్లలను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ముఠాల ఆటకట్టించడానికి ప్రెసిడెంట్ ట్రంప్ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. వీసా నిరాకరణతో పాటు అంతర్జాతీయ చట్టాల సాయంతో నేరస్థుల ఆస్తులను జప్తు చేయడం, అవసరమైతే అమెరికాకు రప్పించి కఠినంగా శిక్షించేందుకు యూఎస్ అస్త్రాలను సిద్ధం చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీడీపీకి బోండా ఉమా...

ఏపీ రాజకీయాల్లో పసుపు జెండాను వీడి...

బ్రేకింగ్: ధర్మేంద్ర ప్రధాన్...

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్...

సీమకు మరో బంపర్...

రాయలసీమకు కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్...

కోడలిపై జోగి రమేష్‌...

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా...

సీదిరి అప్పలరాజు రిమాండ్...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

పోల్స్