Saturday, July 25, 2026 08:56 PM
Saturday, July 25, 2026 08:56 PM

12 ఏళ్లలో తొలిసారి మోకరిల్లిన మోడీ..!

దేశ రాజకీయాల్లో గత 12 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తన సుదీర్ఘ అధికార ప్రస్థానంలో తొలిసారిగా తీవ్ర ఆత్మరక్షణలో పడ్డారు. నిరంతరం ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేసే మోదీ సర్కార్, ఇప్పుడు రక్షణాత్మక ధోరణిలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. గడిచిన పుష్కర కాలంలో దేశంలో ప్రభుత్వం ఈ స్థాయిలో డిఫెన్స్‌ లో పడటం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా నీట్ పరీక్ష అవకతవకల వ్యవహారంలో వచ్చిన భారీ ఒత్తిడికి తలొగ్గి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయడం మోదీ సర్కార్‌ను మరింత డిఫెన్స్‌ లోకి నెట్టింది.

Also Read : ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. ప్యూచర్ ప్లాన్ ఏంటి..?

సిజిపి గత వారం రోజులుగా ఢిల్లీ వేదికగా ఉధృతంగా చేసిన నిరసనలు, విధించిన డెడ్‌ లైన్ కారణంగానే ఈ చారిత్రాత్మక రాజీనామా జరిగిందనే చర్చ దేశవ్యాప్తంగా నడుస్తోంది. నిరుద్యోగ సమస్య, పేపర్ లీకేజీలపై ఆగ్రహించిన లక్షలాది మంది యువతీ యువకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనల సెగ నేరుగా ఢిల్లీ నడిబొడ్డును తాకడమే కాకుండా, జమ్మూ కాశ్మీర్‌ లో సైతం ఆందోళనలతో ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. ఈ రకమైన సామూహిక ప్రజా తిరుగుబాటును ప్రధాని మోదీ గత 12 ఏళ్లలో ఎన్నడూ ఎదుర్కోలేదు.

Also Read : టీడీపీకి బోండా ఉమా గుడ్‌బై..?

అటు పార్లమెంట్ లోపల కూడా ప్రతిపక్షాలు మునుపెన్నడూ లేనంత ఐక్యంగా పోరాడుతూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సొంతంగా పూర్తి మెజారిటీ లేకపోవడం, కూటమి భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సి రావడంతో విపక్షాలు పూర్తి స్థాయిలో పైచేయి సాధిస్తున్నాయి. మంత్రి రాజీనామాతో బలపడిన ఈ ప్రజా నిరసనల నేపథ్యంలో, గడిచిన 12 ఏళ్లలో ఈ స్థాయిలో మోదీ ఇమేజ్ మరియు పట్టు తగ్గడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమెరికా గ్లోబల్ వీసా...

ప్రపంచంలో ఏ మూల కూర్చుని అమెరికా...

టీడీపీకి బోండా ఉమా...

ఏపీ రాజకీయాల్లో పసుపు జెండాను వీడి...

బ్రేకింగ్: ధర్మేంద్ర ప్రధాన్...

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్...

సీమకు మరో బంపర్...

రాయలసీమకు కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్...

కోడలిపై జోగి రమేష్‌...

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా...

పోల్స్