Friday, August 7, 2026 06:52 PM
Friday, August 7, 2026 06:52 PM

పేకాట ఆడితే జైలే.. ఏపీ హైకోర్ట్ సంచలనం

పేకాట.. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినబడే మాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో పేకాట.. మూడు ముక్కలు ఆరు ఆటలుగా సాగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలో పేకాట ప్రభావం ఎక్కువ. దీనిపై పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినప్పటికీ ఆటగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పేకాట శిబిరాలు ఎక్కువగా నిర్వహించేవారు అనే ఆరోపణలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టింది.

Also Read :ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరికీ దక్కుతుంది..?

ఎక్కడైనా పేకాట ఆడితే పోలీసులు వేటాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి పెద్దగా కేసులు ఉండవు అని అభిప్రాయం కూడా జనాల్లో ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. నూజివీడు మ్యాంగో బె పేకాట క్లబ్ వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పేకాట ఆడే వారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విచారణకు క్లబ్ నిర్వాహకులు సహకరించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపాయి.

Also Read : ఈ ఎమ్మెల్యే గారు మారరా..? చికాకులో క్యాడర్..!

వాస్తవానికి పేకాట విషయంలో పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారు అనే పేరు కూడా ఉంది. ఇలాంటి సమయంలో సంచలనం రేపిన నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారం.. పోలీస్ వర్గాల్లో కూడా చర్చనీయాంసంగా మారింది. అయితే తమకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ పేకాట కార్యకలాపాలను క్లబ్ నిర్వాహకులు నిర్వహించారు. పేకాట ఆడుతూ మొత్తం 285 మంది పట్టుబడగా ఏకంగా 34 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి పోలీసులపై పేకాట నిర్వాహకులు కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని.. న్యాయపరంగా కూడా చిక్కులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కవితను లైట్ తీసుకున్న...

తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ...

ఈవీఎంలకు వ్యతిరేకంగా కాక్రోచ్...

ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నీట్...

బెజవాడ మేయర్ పీఠంపై...

ఇటీవల కాపు నేత ముద్రగడ పద్మనాభం...

ఎలా చెబితే అర్థం...

సాధారణంగా ఒక నానుడి ఉంది. అదేమిటంటే.....

ఇంట్రస్టింగ్ గా సీఎం...

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం...

పక్కన పెడతారా.. ఉద్యమిస్తారా..?...

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర...

పోల్స్