Monday, October 12, 2026 02:13 PM
Monday, October 12, 2026 02:13 PM

తమిళనాడు సీఎం విజయ్ ఏపీ షెడ్యూల్ ఇదే..!

దక్షిణ భారత రాజకీయాల్లో ఆసక్తికర, కీలక భేటీకి అమరావతి వేదిక కాబోతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం అధినేత సీఎం విజయ్ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం కానుండటం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ ఇద్దరు నేతల భేటీ వెనుక ఉన్న రాజకీయ ప్రాధాన్యతలపై ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.

Also Read : జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ సంచలన పిటిషన్..!

అక్కడ ఆయనకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలకనున్నారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన అమరావతికి బయలుదేరుతారు. సాయంత్రం 4:15 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సీఎం విజయ్ సమావేశం అవుతారు. ఇరు రాష్ట్రాల సమ్మేళనం, తాజా రాజకీయ పరిణామాలు మరియు ద్వైపాక్షికాంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యమంత్రితో భేటీ ముగిసిన అనంతరం, సాయంత్రం 6:00 గంటలకు విజయ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Also Read : ఏపీ లోకల్ పోరు.. ఈసీ రిజర్వేషన్ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ..?

ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయనున్నారు. అమ్మవారి దర్శనం, తీర్థప్రసాదాల స్వీకరణ అనంతరం సీఎం విజయ్ రాత్రి 8:30 గంటలకు తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుండి ప్రత్యేక విమానంలో చెన్నైకి తిరుగుప్రయాణమవుతారు. తమిళనాట సరికొత్త రాజకీయ శకానికి తెరతీసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్.. చంద్రబాబు నాయుడును కలవబోతుండటం ఇరు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదేనా లేక రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల వ్యూహాలు, జాతీయ రాజకీయ సమీకరణాలపై ఏవైనా కీలక చర్చలు జరగబోతున్నాయా అన్న కోణంలో రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పెన్షన్.. వివరించకుంటే ప్రమాదమే..!

నవంబర్ నెల నుంచి ఎన్‌టీఆర్ భరోసా...

విజయవాడ మేయర్ అభ్యర్థి...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా...

ఏపీ లోకల్ పోరు.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

రాష్ట్రంలో కరువు ముప్పు.....

తెలంగాణలో రానున్న రోజుల్లో తీవ్ర నీటి...

ఎన్టీఆర్ కట్టించిన ఇల్లు.....

హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే...

వైసీపీ కుట్రలకు చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం...

పోల్స్