Monday, October 12, 2026 05:02 PM
Monday, October 12, 2026 05:02 PM

బాంబు పేల్చిన రాహుల్.. అతన్ని నిద్రపోనివ్వం..!

దేశ రాజధాని వేదికగా సాగుతున్న ఓటర్ల జాబితా సవరణ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఓట్లు తొలగించారంటూ వస్తున్న ఆరోపణలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్‌కు సంచలన సవాల్ విసిరారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వంలోని దర్యాప్తు సంస్థల తీరును ఎండగడుతూ ఊహించని వ్యాఖ్యలు చేశారు.

Also Read : తమిళనాడు సీఎం విజయ్ ఏపీ షెడ్యూల్ ఇదే..!

ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పనిచేస్తున్న దాదాపు 200 మందికి పైగా ఉన్నతాధికారులు తమతో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారని రాహుల్ గాంధీ బాంబు పేల్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లతో పాటు విదేశాంగ శాఖలో ఉన్న పలువురు అధికారులు లోపల ఏం జరుగుతుందో తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నవారే లోపాయకారీగా తమకు మద్దతు ఇస్తున్నారని ఆయన పేర్కొనడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read : పెన్షన్.. వివరించకుంటే ప్రమాదమే..!

ఇదే సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ లక్ష్యంగా రాహుల్ గాంధీ కఠిన వ్యాఖ్యలు చేశారు. “జ్ఞానేష్ కుమార్ చరిత్ర అంతా మాకు తెలుసు.. ఆయన చేసిన ప్రతి అక్రమానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, వాటన్నింటినీ త్వరలోనే దేశం ముందు బయటపెడతాం” అని హెచ్చరించారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపై తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసే వరకు ఆయనను నిద్రపోనివ్వం అని రాహుల్ గాంధీ స్పష్టం చేసారు. దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలన్నా, ప్రజాస్వామ్యం బతికాలన్నా కేంద్ర ఎన్నికల సంఘంలో విప్లవాత్మక మార్పులు రావాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే వరకు, తొలగించిన ప్రతి ఓటరుకు న్యాయం జరిగే వరకు దేశవ్యాప్తంగా తమ ఆందోళనలు, పోరాటాలు కొనసాగుతాయని రాహుల్ గాంధీ హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తమిళనాడు సీఎం విజయ్...

దక్షిణ భారత రాజకీయాల్లో ఆసక్తికర, కీలక...

పెన్షన్.. వివరించకుంటే ప్రమాదమే..!

నవంబర్ నెల నుంచి ఎన్‌టీఆర్ భరోసా...

విజయవాడ మేయర్ అభ్యర్థి...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా...

ఏపీ లోకల్ పోరు.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

రాష్ట్రంలో కరువు ముప్పు.....

తెలంగాణలో రానున్న రోజుల్లో తీవ్ర నీటి...

ఎన్టీఆర్ కట్టించిన ఇల్లు.....

హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే...

పోల్స్