Wednesday, May 6, 2026 11:32 PM
Wednesday, May 6, 2026 11:32 PM

కేంద్రం కంటే ముందు ఆంధ్ర..!

ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పరుగులు పెడుతోంది. ఇప్పటికే విశాఖ నగరాన్ని డేటా క్యాపిటల్‌గా మార్చే దిశగా కూటమి సర్కార్ శరవేగంగా చర్యలు చేపడుతోంది. అటు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇటు ఐటీ రంగంలోనే కాకుండా.. అన్ని రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. వీటితో పాటు చిన్న చిన్న సంస్థలు కూడా ఏపీలో తమ కార్యాలయాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏపీ సర్కార్ ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు కూడా. దీని వల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతున్నారు కూడా.

Also Read : ఆటో నగర్ ఫేట్ మారుతోంది.. బెజవాడకు బిగ్ రిలీఫ్

చంద్రబాబు అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది విజనరీ. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు 2020 అని 25 ఏళ్ల తర్వాత ప్రజల అవసరాలు ఇలా ఉంటాయని ముందుగానే ఊహించి.. వాటికి అనుగుణంగా మార్పులు, చర్యలు చేపట్టారు చంద్రబాబు. నాడు ఐపీ ప్రభావాన్ని ముందుగానే ఊహించిన చంద్రబాబు.. హైదరాబాద్‌ను భారత్ ఐటీ క్యాపిటల్‌గా మార్చేందుకు ప్రణాళిక వేశారు. అందులో భాగంగానే ఇప్పుడు సైబరాబాద్ నగరం రూపొందింది. పెద్ద పెద్ద సంస్థలతో పాటు వందల సంఖ్యలో స్టార్టప్ సంస్థలు కూడా ఇప్పుడు హైదరాబాద్‌ నుంచే పనులు చేస్తున్నాయి. లక్షల మంది యువత ఈ రంగంలో ఉపాధి పొందుతోంది. లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు కూడా నడుస్తున్నాయి. తాజాగా ఏపీని కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రం కంటే దాదాపు నెల రోజుల ముందే ఏపీలో కొత్త స్టార్టప్‌ సంస్థ అందుబాటులోకి వచ్చింది.

Also Read :25 ఎకరాల భూమి కోసం అసోం సీఎంకు చంద్రబాబు లేఖ.. ఏంటీ స్టోరీ..?

జనవరి 1వ తేదీ నుంచి భారత్‌ ట్యాక్సీ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని వల్ల ప్రజలకు మెరుగైన సేవలతో పాటు ప్రైవేటీ ట్యాక్సీల దోపిడీకి అడ్డుకట్ట కూడా పడుతుందని కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే భారత్ ట్యాక్సీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా సుమారు లక్ష మంది ట్యాక్సీ డ్రైవర్లు ఇందులో నమోదు చేసుకున్నారు. ముందుగా ఉత్తర ప్రదేశ్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే ఈ లోపుగానే ఏపీలో ఆంధ్ర ట్యాక్సీ అందుబాటులోకి వచ్చేసింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో దీనిని అమలు చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఆంధ్ర ట్యాక్సీ యాప్ అందుబాటులో ఉంది. ఇందులో ఆటో, కార్, టెంపో, ప్రీమియం రైడ్‌కు అవకాశం ఇచ్చారు. అమరావతి సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో ఈ యాప్ డెవలప్‌ చేశారు. ఇది ఏపీ వ్యాప్తంగా సేవలందిస్తుందని యాప్ నిర్వాహకులు తెలిపారు. రిజిస్టేషన్ సమయంలో ఎలాంటి పర్సనల్ డేటా అవసరం లేదని.. వినియోగదారుల రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. యాప్, వాట్సప్, క్యూఆర్ స్కాన్ ద్వారా కూడా బుకింగ్ అవకాశం ఉంది. ట్యాక్సీతో పాటు పర్యాటక, హోటల్ బుకింగ్ అవకాశం కూడా కల్పించారు. సంక్రాంతి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర ట్యాక్సీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్