Sunday, June 21, 2026 12:27 PM
Sunday, June 21, 2026 12:27 PM

ఈరోజు (22-12-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం 22-12-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…

మేషం 22-12-2025

భూ క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశజనకంగా ఉంటాయి. సోదరులతో వివాదాలు రాజి చేసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

—————————————

వృషభం 22-12-2025

రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. పాత బాకీలు కొంత వరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

—————————————

మిధునం 22-12-2025

నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. సంతాన విద్యా విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి.
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి.

—————————————

కర్కాటకం 22-12-2025

దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది.
కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆర్థిక వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

—————————————

సింహం 22-12-2025

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. సంతాన శుభకార్య విషయాలపై చర్చలు ఫలిస్తాయి. అవసరానికి చేతికిడబ్బు అందుతుంది.

—————————————

కన్య 22-12-2025

బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

—————————————

తుల 22-12-2025

ఋణదాతల ఒత్తిడి నుండి అధికమై నూతన ఋణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. వ్యాపారాలలో ఊహించని నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలించదు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు.

—————————————

వృశ్చికం 22-12-2025

ఆస్తి వ్యవహారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానిస్తాయి. మాతృ వర్గ బంధువుల నుండి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.

—————————————

ధనస్సు 22-12-2025

వివాదాలకు సంభందించి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఓర్పుతో మీ సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు.

—————————————

మకరం 22-12-2025

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

—————————————

కుంభం 22-12-2025

ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి వ్యాపారమున ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు.

—————————————

మీనం 22-12-2025

కొన్ని వ్యాపావహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సన్నిహితుల నుండి ఊహించని సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్