సరిగ్గా ఆరు నెలల క్రితం… మా జగనన్న… జగన్ ఫ్యాన్స్.. జగన్ వెంటే మేమంతా… అనే మాటలు బాగా వినిపించాయి. సీన్ కట్ చేస్తే… జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వై నాట్ 175 అన్న జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అంతే… తలకొట్టేసినట్లైంది… “వెంటనే పెట్టే బేడ సర్దుకుని తుర్రుమని బెంగళూరు చెక్కేశాడు..” అని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. పదేళ్లుగా ఓదార్పు యాత్రలు చేస్తున్న జగన్‌ను చివరికి అమ్మ, చెల్లి కూడా ఎంత కష్టం వచ్చిందని ఓదార్చలేదు. కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన జగన్ కూడా.. ఆస్తి కోసం కోర్టుకు ఎక్కడంతో… ఆ దుమారం వేరే లెవల్‌కు చేరుకుంది. దీంతో తొలి ఆరు నెలల్లో జగన్ పరిస్థితి పూర్తిగా తల్లకిందులైందనే చెప్పాలి.
Also Read : ప్లీజన్నా రండి.. పార్టీ నేతలకు జగన్ రిక్వెస్ట్
ఇలాంటి పరిస్థితుల్లో జనవరి నెలలో సంక్రాంతి తర్వాత నుంచి జనంలోకి వస్తానని స్వయంగా జగన్ వెల్లడించాడు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజులుంటా… కార్యకర్తలతో మాట్లాడుతా… మీ సమస్యలు నేరుగా తెలుసుకుంటా.. అని చెప్పిన జగన్… దానికి కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరు పెడుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ మాటనే ఇప్పుడు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం… జగన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయమే అంటున్నారు. జిల్లాల పర్యటనకు జగన్ వచ్చిన సందర్భంలో కేవలం ఆయన మాత్రమే కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారని… కాబట్టి ఆ సమావేశానికి స్థానిక నేతలు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరవ్వాల్సిన అవసరం లేదని పార్టీ అధిష్ఠానం ఆదేశాలిస్తోంది.
Also Read : అదానితో ఒప్పందం రద్దు అయితే, పెనాలిటీ ఎన్ని వేల కోట్లంటే…!
నియోజకవర్గంలో తమ ప్రమేయం లేకుండా సమావేశాలు నిర్వహించడం ఏమిటనేది సదరు నేతల ప్రశ్న. నేరుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తే… రేపు అదే కార్యకర్తల దగ్గర తామంతా చులకన అపుతాం కదా అనేది గెలిచిన ప్రజాప్రతినిధుల మాట. అటు నియోజకవర్గాల సమన్వయకర్తలు కూడా ఇదే మాట అంటున్నారు. లీడర్ లేకుండా మీటింగ్ ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. అయితే పార్టీ మాట మాత్రం మరోలా ఉంది. నేతలంతా వేదికపై ఉంటే… కార్యకర్తలు నిర్భయంగా ఎలా తమ సమస్యలు చెప్పగలరు అనేది వైసీపీ అధిష్ఠానం మాట. అందుకే ఈ భేటీకి మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నామని ఏదో సర్దిచెబుతున్నారు. అయితే నేతలు ససేమిరా అనటంతో… ఈ విషయంలో వైసీపీ అధిష్ఠానం ఎటూ తేల్చుకోలేక పోతోంది. వైసీపీ ఓటమికి కారణాలు అధినేతకు తెలియాలంటే.. కార్యకర్తలు ధైర్యంగా మాట్లాడాలి… అందుకే నేతలను దూరంగా ఉంచుతున్నామనేది పెద్దల మాట. అయితే ఐదేళ్లు నియంతలా వ్యవహరించిన జగన్… ఇప్పుడు కూడా అదే ధోరణితో ఉన్నారనేది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల మాట.

