Sunday, June 21, 2026 03:29 AM
Sunday, June 21, 2026 03:29 AM

జగ్గయ్యపేటలో జగన్ కి షాక్ ఇచ్చిన టిడిపి

– టీడీపీలో చేరిన జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర

– రాఘవేంద్రతో పాటు పార్టీలో చేరిన పలువురు వార్డు కౌన్సిలర్లు

– కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్

వైసీపీ సిద్ధాంతాలు, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి విధ్వంసక విధానాలు నచ్చక పలువురు ఆ పార్టీని వీడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్ తగిలింది. జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి.రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు.

Jaggayyapeta YCP Leaders Join TDP

ఉండవల్లి నివాసంలో వీరందరికీ నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ పడనివిధంగా భారీ వర్షాలు కురిశాయి. ప్రభుత్వ అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచింది. వరదలోనూ జగన్ రెడ్డి బురద రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలందరూ ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలని కోరారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్