Wednesday, February 4, 2026 02:48 PM
Wednesday, February 4, 2026 02:48 PM

రీమేక్ పై మనసుపడ్డ బాలయ్య.. ఫాన్స్ కి పండుగేనా..!

చిత్ర పరిశ్రమలో బాలకృష్ణకు ఉన్న మాస్‌ క్రేజ్‌ ఏంటో మనకందరికీ తెలిసిందే! మాస్‌ ఆడియన్సలో ఆయనకు ఫాలోయింగ్‌ మామలుగా ఉండదు. ప్రస్తుతం ఆయన పేరు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఆయన సినిమాలకు సంబంధించిన వార్తలు వైరల్‌ అవుతుండటమే అందుకు ముఖ్య కారణం. బాలకృష్ణ – బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా (NBK109) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఊర్వశీ రౌతేలా, ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్థా శ్రీనాథ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది.

ఇదే నిజమైతే బాలయ్య సరసన ప్రగ్యాను రెండోసారి చూడొచ్చు. ఈ చిత్రంలో బాబీదేవోల్‌ విలన్‌గా కనిపించనున్నారు. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన క్లాసీ లుక్‌లో కనిపించనున్నారట. అలాగే దీనిలో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యం ఈ చిత్రం రూపొందుతుందని తెలిసింది. పోలికలు బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలకి కేరాఫ్ అడ్రెస్స్ గా బాలయ్య నిలుస్తున్నారు. మరికొంత మంది హీరోలు పొలిటికల్ కధాంశంతో సినిమాలు తీసినా బాలయ్య సినిమాల రేంజ్ లో అవి ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు అన్న విషయం కూడా తెలిసిందే. దీంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

Also Read : చిరు, పవన్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్..!

ఇక ఈ ఏడాది సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రాల్లో ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ‘ఆవేశం’ ఒకటి. జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే. కేవలం రూ.30 కోట్లతో నిర్మించిన ఈ యాక్షన్‌ కామెడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.150కోట్లు వసూలు చేసింది. బాలకృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయనున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా హక్కులను కూడా టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే కొనుగోలు చేసిందట. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానున్నట్లు బాలయ్య సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్