Friday, September 18, 2026 11:27 PM
Friday, September 18, 2026 11:27 PM

బీజేపీలో బిఆర్ఎస్ విలీనం

తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రాజకీయ పరిణామం చోటు చేసుకుంటుందా…? ఇప్పటి వరకు తెలంగాణా సెంటిమెంట్ తో రాజకీయం చేసిన కేసీఆర్ ఇక బీజేపి కనుసన్నల్లో బ్రతకాల్సిందేనా…? కవిత బెయిల్ కోసం, కేసీఆర్ అరెస్ట్ తప్పించుకోవడం కోసం బిజెపి తో లాలూచి పడ్డారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా ఆర్ టీవీ బయట పెట్టిన ఒక సంచలన విషయం ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. బిజెపిలో బీఆర్ఎస్ విలీనం అనే మాట ఇప్పుడు గులాబీ శ్రేణులను భయపెడుతోంది.

గత కొన్నాళ్ళుగా తెరాస రాజకీయ చదరంగం లో నానా రకాల కష్టాలు పడుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత అసలు బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండి కనీసం శాసన సభా పక్ష సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. ఒకవైపు రాష్ట్రంలో రేవంత్ దూకుడు, మరో వైపు జాతీయ స్థాయిలో మోడీ సర్కార్ నుంచి ఒత్తిడి తో ఏం చేయాలో పాలుపోని దుస్థితిలో కేసీఆర్ ఉన్నారు. ఈ సమయంలో భాజాపా లో బీఆర్ఎస్ పార్టీ ని విలీనం చేస్తే తనను తాను కాపాడుకోవడమే కాకుండా… పార్టీ నేతలను కూడా కాపాడుకోవచ్చు అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

Also Read : ఆ అధికారుల పై కఠిన నిర్ణయాలకు సిద్దమవుతున్న బాబు

కవితను అరెస్ట్ చేసిన నాటి నుంచి బీజేపి నేతలు పావులు కదుపుతున్నారు. కవిత అప్రూవర్ గా మారి… మొత్తం నెపాన్ని కేజ్రివాల్ మీద నేట్టివేస్తే… కచ్చితంగా ఆమెకు బెయిల్ రావడంతో పాటుగా కేసీఆర్ అరెస్ట్ ను కూడా ఆపే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కెసిఆర్ కు రాజ్యసభ సీటు, తెలంగాణా ఎన్నికల్లో కేటిఆర్ ను సీఎం సీటుకు ఎంపిక చేయవచ్చు. దీనికి ముందు కవిత అంగీకరించకపోయినా.,. హరీష్ రావు, కేటిఆర్ ఇద్దరూ కలిసి ఆమెను ఒప్పించే బాధ్యత తీసుకున్నట్టుగా సమాచారం. ఇది ఆలస్యమైన కొద్దీ, బీఆర్ఎస్ శాసన సభా పక్షాన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కలిపేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు బిజెపి, అలాగే కెసిఆర్ ఇద్దరూ తొందర పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై ఏం జరుగుతుంది అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్