Monday, September 28, 2026 02:22 PM
Monday, September 28, 2026 02:22 PM

పెద్దల సభకు రాజకీయ సమరం..!

తెలంగాణలో మరో కీలక రాజకీయ సమరానికి రంగం సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది మార్చిలో పదవీకాలం ముగియనున్న మహబూబ్‌నగర్, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో… ప్రధాన రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎంపికపై దృష్టి సారించారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఈ రెండు స్థానాలు ప్రతిష్టాత్మకంగా మారగా.. శాసనమండలిలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బీఆర్ఎస్‌కు ఈ ఎన్నికలు మరో పరీక్షగా మారనున్నాయి. గతంలో గ్రాడ్యుయేట్ స్థానాల్లో తనకున్న పట్టును నిలబెట్టుకోవాలని బీజేపీ కూడా వ్యూహాలు సిద్ధం చేస్తుంది.

Also Read : తెనాలి మాజీ ఎమ్మెల్యే గారి చీటింగ్ లీలలు..!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 17గా ఉండగా.. కాంగ్రెస్ 12, బీజేపీ 3, ఎంఐఎం 2, సీపీఐ 1, టీజేఎస్‌ 1, పీఆర్టీయూ 1 సభ్యుడు ఉన్నారు. కౌన్సిల్లో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు స్థానాలను గెలుచుకోవడం కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. వరంగల్ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మహబూబ్‌నగర్ ఇన్‌చార్జ్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. వాటిని వడపోసి ఒక్కో నియోజకవర్గానికి మూడు పేర్లను ఫైనల్ చేయనున్నారు.

Also Read : విజయవాడ ధర్నా చౌక్ హైడ్రామా.. సీఐ మృతి కేసులో సంచలనం..!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులను సాధ్యమైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఒక్కో గ్రాడ్యుయేట్ నియోజకవర్గం దాదాపు 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండటంతో.. ఆర్థికంగా బలంగా ఉన్న ఆశావహులకే అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. రెడ్డి, బీసీ సామాజికవర్గాలకు ఒక్కో టికెట్ కేటాయిస్తారా? లేక గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థుల ప్రాతిపదికన ఎంపిక చేస్తారా? అనే చర్చ సాగుతుంది.

Also Read : మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ బంపర్ ఆఫర్..!

కాంగ్రెస్ పార్టీ నుంచి 2024లో తిన్మార్ మల్లన్న విజయం సాధించగా.. ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు. దీంతో ఈసారి సొంత అభ్యర్థిని బరిలోకి దింపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధులు లోకేష్ యాదవ్, చనగాని దయాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, రేవంత్ మిత్రుడు పటేల్ రమేష్ రెడ్డితో పాటు జర్నలిస్టు కోటాలో పీవీ శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌లో 2024లో ఓడిన ఏనుగుల రాకేష్ పేరును మరోసారి పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్‌తో పోలిస్తే.. బీఆర్ఎస్‌లో పోటీ తక్కువగా ఉందని పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ నుంచి రామచందర్‌రావుతో పాటు పీవీ నరసింహరావు మనవడు ఎన్వీ సుభాష్ పేర్లు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. పెద్దల సభ కోసం ఈసారి పోటీ గట్టిగానే ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెనాలి మాజీ ఎమ్మెల్యే...

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ...

విజయవాడ ధర్నా చౌక్...

విజయవాడ ధర్నా చౌక్ వద్ద సచివాలయ...

మొబైల్ వినియోగదారులకు ట్రాయ్...

ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో...

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

పోల్స్