Saturday, September 26, 2026 08:12 PM
Saturday, September 26, 2026 08:12 PM

నేను రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు.. కోహ్లీ కీలక ప్రకటన..!

భారత క్రికెట్ దిగ్గజం, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. గత ఏడాది టెస్ట్ ల నుంచి తప్పుకున్న నేపధ్యంలో వన్డేల నుంచి కూడా రిటైర్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. అటు సెలెక్షన్ కమిటీ నుంచి ఒత్తిడి ఉంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్ భవిష్యత్తుపై అత్యంత కీలక ప్రకటన చేసాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్ట్ లకు గుడ్‌బై చెప్పేసిన కోహ్లీ, వన్డే ఫార్మాట్‌లో తాను ఎంతకాలం కొనసాగుతాననే అంశంపై క్రికెట్ ప్రపంచానికి పూర్తి స్పష్టతనిచ్చాడు.

Also Read : సరస్ మేళా : డ్వాక్రా మహిళలకు జాతీయ స్థాయిలో బ్రాండింగ్

బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ ప్రణాళికలను అధికారికంగా వెల్లడించి అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. వచ్చే ఏడాది అంటే 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల ఉమ్మడి ఆతిథ్యంలో జరగబోయే ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీయే భారత్ తరఫున తాను ఆడబోయే చివరి మెగా ఈవెంట్ అని కింగ్ కోహ్లీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం 37 ఏళ్ల వయసున్న కోహ్లీ, ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీతో తన సుదీర్ఘ వన్డే ప్రపంచకప్ ప్రస్థానానికి ముగింపు పలకబోతున్నట్లు స్పష్టం చేసాడు.

Also Read : జగన్ మునిగితే తాను మునుగుతా అనే సాయి రెడ్డి భయమా..?

తన కెరీర్‌లో ఇది 5వ వన్డే వరల్డ్ కప్ కానుంది. ఈ చివరి ప్రపంచకప్‌లో ఎలాగైనా సరే దేశానికి కప్పు అందించడమే తన ఏకైక లక్ష్యమని కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడేందుకు మైదానంలో నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, టీమిండియాను విజేతగా నిలబెట్టడానికి తన సర్వస్వాన్ని ఒడ్డుతానని భరోసా ఇచ్చాడు. ఈ మెగా టోర్నీని అత్యంత చిరస్మరణీయంగా మార్చుకోవడానికి తన వైపు నుంచి ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించాడు. విదేశీ పిచ్‌లపై, భిన్నమైన వాతావరణ పరిస్థితుల మధ్య సుమారు 10 వన్డే మ్యాచ్‌ల పాటు ఒకే రకమైన హై-ఇంటెన్సిటీని మెయింటైన్ చేయడం శారీరకంగా, మానసికంగా ఎంతో సవాలుతో కూడుకున్నదని కోహ్లీ పేర్కొన్నాడు. అయినప్పటికీ దేశం కోసం కప్పు గెలవాలనే పట్టుదలతోనే తాను ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు ధీమా వ్యక్తం చేశాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

పోల్స్