Thursday, September 24, 2026 08:30 PM
Thursday, September 24, 2026 08:30 PM

బ్రేకింగ్: ఎన్నికల కమీషనర్ పై కాక్రోచ్ గురి..!

కేంద్ర ఎన్నికల సంఘం చుట్టూ ముసురుకున్న వివాదాలు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో దేశవ్యాప్తంగా భారీగా ఓట్ల తొలగింపు జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి పార్లమెంట్‌ ఉభయసభల్లో సీఈసీపై అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చేందుకు చకచకా అడుగులు వేస్తున్నాయి.

Also Read : పల్నాడులో వైసీపీ మార్క్ దోపిడీ.. విచారణలో సంచలన నిజాలు..!

ఈ కీలక పరిణామంపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్ సహా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. ఎన్నికల నిర్వహణలో, ఓట్ల సవరణ ప్రక్రియలో సీఈసీ ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, తోటి కమీషనర్ల అభ్యంతరాలను సైతం తొక్కిపెట్టారనే అంశాలను విపక్షాలు ప్రధానంగా లేవనెత్తుతున్నాయి. లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో డ్రాఫ్ట్ నోటీసును సిద్ధం చేయిస్తున్నామని, రాబోయే రెండు వారాల్లోగా లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌లకు అధికారికంగా ఈ అభిశంసన నోటీసును సమర్పించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

Also Read : మిమ్మల్ని రష్యా వాడుకుంటుంది.. భారత్ కు ఉక్రెయిన్ వార్నింగ్..!

భారత రాజకీయ చరిత్రలో ఒక సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో విపక్షాలు ఇచ్చిన నోటీసులను సాంకేతిక కారణాలతో పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులు తిరస్కరించారు. అయితే ఈసారి బయటపడ్డ ఈసీ అంతర్గత విభేదాలు, గోవా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లేఖల ఆధారంగా పక్కా సాక్ష్యాలతో సరికొత్త నోటీసును ఇరు సభల్లో ప్రవేశపెట్టేందుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణే ధ్యేయంగా సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయాల ముట్టడికి కూడా కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే నోటి...

ఇప్పటికీ ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు...

పల్నాడులో వైసీపీ...

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో...

భోగాపురంలో కంగారుపెట్టిన విమానం..!

విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్...

టీచర్లను కొట్టినా 24...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ...

పిఠాపురంలో పవన్ మార్క్.....

పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఉప...

శీనన్న.. ఇలా అడ్డంగా...

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి....

పోల్స్