Thursday, September 24, 2026 08:31 PM
Thursday, September 24, 2026 08:31 PM

రొమాంటిక్ ట్రాప్‌.. వలలో చిక్కిన లాయర్..!

హయ్.. అంటారు.. బాగున్నావా అని పలకరిస్తారు. ఆ తర్వాత మాట కలుపుతారు.. ఆ తర్వాత నుంచి మొదలవుతుంది అసలు కథ. కొందరు మగాళ్ల బలహీనతే వారి పెట్టుబడి. శ్రావ్యమైన మాటే వారి ఆయుధం. సైలెంట్‌గా ముగ్గులోకి దింపుతారు.. ఆ తర్వాత నుంచి అసలు ప్లాన్ అమలు చేస్తారు. కొందరేమో శారీరకంగా వేధించి.. అందినంత మేర గుంజుతారు. మరికొందరు మాత్రం మానసికంగా దెబ్బకొట్టి తమ పని కానిచ్చేస్తారు. బలహీనతను సొమ్ము చేసుకుంటూ సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ ఉచ్చులో డాక్టర్లు, వృద్ధులు, యువకులు, నడి వయసు వాళ్లు పడటం చూశాం. తాజాగా ఓ లాయర్ చిక్కుకుని విలవిలలాడుతున్నాడు.

Also Read : బ్రేకింగ్: ఎన్నికల కమీషనర్ పై కాక్రోచ్ గురి..!

హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది భారీ సైబర్‌ మోసానికి గురయ్యారు. ప్రేమ పేరుతో పరిచయం పెంచుకున్న మోసగాళ్లు.. వివిధ కారణాలు చెబుతూ ఆయన నుంచి విడతల వారీగా భారీ మొత్తాన్ని బదిలీ చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 241 లావాదేవీల్లో రూ.4.91 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు తెలుస్తోంది. మొదట సోషల్‌ మీడియా లేదా ఆన్‌లైన్‌ వేదిక ద్వారా పరిచయం ఏర్పడినట్లు సమాచారం. అనంతరం నిందితులు న్యాయవాదితో సన్నిహితంగా మెలుగుతూ నమ్మకం పెంచుకున్నారు. ఆ తర్వాత పెట్టుబడులు, అత్యవసర అవసరాలు తదితర కారణాలు చెబుతూ డబ్బులు పంపించాలని కోరి.. నగదు నొక్కేశారు.

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ పరిధిలోని ఒక ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న 27 ఏళ్ల యువ న్యాయవాదికి.. గత ఏడాది ఆగస్టులో ఒక పాపులర్ డేటింగ్ యాప్ ద్వారా ‘దిశ’ అనే పేరుతో ఒక ఐడి పరిచయమైంది. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్స్ ద్వారా ఆ యువ లాయర్‌ను నమ్మించి వల వేశారు. ఒక్కసారి, రెండుసార్లు కాకుండా.. 241 విడతల్లో భారీ మొత్తంలో నగదు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. పరిచయం పెరిగిన తర్వాత, ‘అలీనా’ అనే పేరుతో ఒక ట్రాన్స్‌జెండర్ రంగంలోకి దిగి బాధితుడిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. ప్రైవేట్ విషయాలను బయటపెడతామంటూ, కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారు.

Also Read : మిమ్మల్ని రష్యా వాడుకుంటుంది.. భారత్ కు ఉక్రెయిన్ వార్నింగ్..!

చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డబ్బు ఏ ఖాతాలకు వెళ్లింది? లావాదేవీల వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులను పూర్తిగా నమ్మి భారీ మొత్తాల్లో నగదు బదిలీ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: ఎన్నికల కమీషనర్...

కేంద్ర ఎన్నికల సంఘం చుట్టూ ముసురుకున్న...

కాంగ్రెస్ ఎమ్మెల్యే నోటి...

ఇప్పటికీ ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు...

పల్నాడులో వైసీపీ...

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో...

భోగాపురంలో కంగారుపెట్టిన విమానం..!

విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్...

టీచర్లను కొట్టినా 24...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ...

పిఠాపురంలో పవన్ మార్క్.....

పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఉప...

పోల్స్