Thursday, September 24, 2026 07:57 PM
Thursday, September 24, 2026 07:57 PM

సర్ లోపాలు.. సీఈసీ వర్సెస్ కమిషనర్లు..!

దేశ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈసీఐ పనితీరుపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కమిషనర్లు సుఖ బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వచ్చిన కథనాలు జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. సర్ ప్రక్రియ అమలు తీరు తీవ్ర ఆక్షేపణలకు దారితీస్తోంది.

Also Read : మిమ్మల్ని రష్యా వాడుకుంటుంది.. భారత్ కు ఉక్రెయిన్ వార్నింగ్..!

రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘంలో కీలక నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయంతో లేదా మెజారిటీ ఓటుతోనే జరగాలి. అయితే, తమ ప్రమేయం లేకుండానే సీఈసీ కీలక ఉత్తర్వులు, సందేశాలు జారీ చేశారని తోటి కమిషనర్లు గత 10 నెలల్లో కనీసం 14 సార్లు.. వీటిల్లో ఒక్కరోజే నాలుగుసార్లు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఈ పరిణామాలు కమిషన్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా సంస్థాగత సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ఈ విభేదాలు రచ్చకెక్కడంతో మీడియాకు ఈసీ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. సంస్థాగత చర్చల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సహజమేనని, నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే అమలయ్యాయని స్పష్టం చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో అసంతృప్తి లిఖితపూర్వకంగా ఉందా.. లేదా మౌఖికంగా ముగిసిందా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన ‘సర్’ ప్రక్రియ తీవ్ర విమర్శలపాలవుతోంది. పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ఓటర్లపైనే మోపడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ట్రిబ్యునల్ పరిధిలో 37 లక్షల అప్పీళ్లు పెండింగ్ ఉండగా, మొదటి లక్ష కేసుల విచారణలో 93 వేల మంది అంటే ఏకంగా 93 శాతం మంది అర్హులైన ఓటర్లుగా తేలారు. కేవలం 7 శాతం మాత్రమే నకిలీగా గుర్తించారు. ఈ లెక్కన పరిశీలిస్తే, కేవలం సాంకేతిక, విధానపరమైన లోపాల వల్ల దాదాపు 34 లక్షల మంది నిజమైన ఓటర్లు తమ రాజ్యాంగ బద్ధమైన ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read : భారత్-పాక్ రచ్చపై అమెరికా సంచలన కామెంట్స్..!

ఒక రాజ్యాంగ సంస్థ ప్రతిష్ట దెబ్బతింటే ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్లుతుంది. కమిషనర్ల ఆరోపణలు నిజమైతే రాష్ట్రపతి జోక్యం చేసుకోవడమో లేదా పార్లమెంటు, న్యాయస్థానాల ద్వారా నిగ్గు తేల్చడమో జరగాలి. అదే సమయంలో సర్ లోపాలను వెంటనే సరిదిద్ది, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా హక్కు కోల్పోకుండా ప్రభుత్వం, ఎన్నికల సంఘం పారదర్శక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: ఎన్నికల కమీషనర్...

కేంద్ర ఎన్నికల సంఘం చుట్టూ ముసురుకున్న...

కాంగ్రెస్ ఎమ్మెల్యే నోటి...

ఇప్పటికీ ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు...

పల్నాడులో వైసీపీ...

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో...

భోగాపురంలో కంగారుపెట్టిన విమానం..!

విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్...

టీచర్లను కొట్టినా 24...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ...

పిఠాపురంలో పవన్ మార్క్.....

పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఉప...

పోల్స్