ప్రస్తుత ఐక్యరాజ్యసమితి వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన వివాదాలను పరిష్కరించే శక్తి దానికి లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన, ఐక్యరాజ్యసమితి తన అసలు లక్ష్యాన్ని విస్మరించి, తనకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.
Also Read : ఏపీలో గర్భిణీలకు తీపి కబురు..!
అంతర్జాతీయ వ్యవస్థలు విఫలమైనప్పుడు, డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ఎల్లప్పుడూ ప్రపంచ ప్రయోజనాల కంటే తమ సొంత దేశ జాతీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, భారత్-పాకిస్తాన్ వివాదాన్ని పరిష్కరించడంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. 2025 మే నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తమ మధ్యవర్తిత్వం వల్లే సాధ్యమైందని ట్రంప్ క్రెడిట్ తీసుకోవడంపై భారత్ అసహనం వ్యక్తం చేసింది.
Also Read : లోకల్ వార్.. ఓట్ షేర్ పెరుగుతుందా.. తగ్గుతుందా..?
పలు సందర్భాల్లో భారత్ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చింది. ఇరు దేశాల సైనిక చర్యల డైరెక్టర్ జనరల్స్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారానే ఈ ఒప్పందం కుదిరిందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌తో ఉన్న ఎలాంటి సమస్యనైనా మూడో పక్షం జోక్యం లేకుండా, కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా, ఉగ్రవాదం మరియు హింస లేని ప్రశాంత వాతావరణంలో మాత్రమే పరిష్కరించుకుంటామని భారత్ తన పాత విధానాన్ని మరోసారి స్పష్టం చేసింది.

