Thursday, September 24, 2026 02:11 PM
Thursday, September 24, 2026 02:11 PM

పల్నాడులో వైసీపీ మార్క్ దోపిడీ.. విచారణలో సంచలన నిజాలు..!

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న భారీ భూ ఆక్రమణల ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తీవ్రస్థాయిలో విచారణ చేపట్టారు. గత ఐదేళ్ల పాలనలో అధికార దుర్వినియోగానికి పాల్పడి వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కాజేశారన్న కథనాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా దాచేపల్లి మండల పరిధిలో ఏకంగా 2 వేల ఎకరాలకు పైగా ఉన్న విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి, అధికారుల సహాయంతో లేదా ఒత్తిళ్లతో అక్రమంగా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

Also read : ఖైరతాబాద్.. గులాబీ పార్టీకి అంత వీజీ కాదు..!

ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాచేపల్లి మండలంలోని శ్రీనివాసపురం, పొందుగల, తంగెడ తదితర గ్రామాల్లో అధికారులు స్వయంగా పర్యటించి ఆక్రమణలకు గురైన భూములను సరిహద్దులతో సహా పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న వివరాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు మధ్య ఉన్న తేడాలను గుర్తించే పనిలో పడ్డారు. అక్రమంగా నమోదు చేసుకున్న ఈ ప్రభుత్వ భూముల ఆధారంగా వివిధ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు కూడా ఆరోపణలు వస్తుండటంతో, బ్యాంకింగ్ వ్యవహారాలపై కూడా అధికారులు దృష్టి సారించారు.

Also read : పిఠాపురంలో పవన్ మార్క్.. గంటల్లో సమస్యలు పరిష్కారం..!

ఈ భూ కుంభకోణానికి సంబంధించి రెవెన్యూ అధికారుల నుంచి కీలకమైన దస్త్రాలు, ఆన్‌లైన్ రికార్డుల వివరాలను విజిలెన్స్ బృందం సేకరిస్తోంది. అక్రమంగా భూములను రికార్డుల్లోకి ఎక్కించడంలో సహకరించిన అధికారులు, వెనక ఉండి నడిపించిన నాటి వైసీపీ నాయకుల పాత్రపై ఆరా తీస్తున్నారు. భూ కేటాయింపులు, పట్టాల మార్పిడి, రుణాల మంజూరు వెనుక ఉన్న సూత్రధారులను తేల్చేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ ఆక్రమణలపై పూర్తిస్థాయి ఆధారాలతో కూడిన నివేదికను విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

భోగాపురంలో కంగారుపెట్టిన విమానం..!

విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్...

టీచర్లను కొట్టినా 24...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ...

పిఠాపురంలో పవన్ మార్క్.....

పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఉప...

శీనన్న.. ఇలా అడ్డంగా...

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి....

ఖైరతాబాద్.. గులాబీ పార్టీకి...

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత...

ఏపీ పోలీసులకు జగన్...

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల...

పోల్స్