BCలనే కాదు..వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలను దగా చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నా SC, నా ST అంటూనే వారికి వెన్నుపోటు పొడిచారు జగన్. ఆ వర్గాల సంక్షేమానికి కూడా గత వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. SC,ST వర్గాల ఉపాధి కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించి ఆ వర్గాలను మోసం చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
Also Read : కన్వర్ట్ అయితేనే వైసీపీలో పదవులా..? డ్యామేజ్ అయిన జగన్ ఇమేజ్
SC, ST డ్వాక్రా మహిళల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఉన్నతి పథకానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి కూడా వడ్డీ లేని రుణం మంజూరు చేయలేదు. అంతకుముందు TDP హయాంలో (2014-19 మధ్య) ఈ పథకానికి ఏకంగా రూ.766.71 కోట్లు కేటాయించి దాదాపు 2.30 లక్షల మంది మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఉన్నతి పథకం ఖాతాల్లో ఉన్న నిధుల్లోంచి రూ.150 కోట్లను అన్యవిధంగా దారి మళ్లించారు.
2013 నుంచి ఇప్పటి వరకు ఈ పథకం కింద జరిగిన నిధుల వినియోగ తీరుపై కూటమి ప్రభుత్వం తాజాగా ఆరా తీయగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంలో రూ.7.6 కోట్లు దుర్వినియోగం కాగా, అందులో దాదాపు 90 శాతం వైసీపీ పాలనా కాలంలోనే జరగడం విశేషం. ఈ అవకతవకలకు బాధ్యులైన 69 మంది క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇప్పటికే క్రమశిక్షణా చర్యలు తీసుకుని, రూ.1.19 కోట్లను రికవరీ చేశారు.
Also Read : ఏకగ్రీవాలను వైసీపీ అడ్డుకోగలదా..?
ఒకవైపు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం అంటూనే మరోవైపు ఆ వర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేయడం వైసీపీ వైఖరికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలకు ఆర్థికంగా చేయూత కల్పించే పథకాలను సైతం రాజకీయ ప్రయోజనాలు, నిధుల మళ్లింపునకు ఉపయోగించుకోవడం ద్వారా ఆ పార్టీ అధినేత జగన్ ఆ వర్గాల వెన్ను విరిచారు.

