Friday, August 14, 2026 04:45 PM
Friday, August 14, 2026 04:45 PM

బ్రేకింగ్ : అమరావతిపై ఆళ్ళ కుట్రలకు సుప్రీం బ్రేక్..!

రాజధాని అమరావతి అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి భూముల ల్యాండ్ పూలింగ్‌ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం పూర్తిగా కొట్టివేసింది. గతంలో ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, ఆళ్ల రామకృష్ణారెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో అమరావతి భూసేకరణ చట్టబద్ధతపై న్యాయపరంగా మరోసారి స్పష్టత వచ్చినట్లయింది.

Also Read : షూటింగ్ లేకపోయినా సెట్స్ లోనే ప్రభాస్.. ఎందుకు..?

గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని పరిధిలోని దళితులకు కేటాయించిన అసైన్‌మెంట్ భూములను నిబంధనలకు విరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉన్న కొందరు పెద్దలు మరియు ప్రైవేట్ వ్యక్తులకు భారీగా లబ్ధి చేకూర్చేందుకే ఒక ప్రణాళిక ప్రకారం, కుట్రపూరితంగా ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ను తీసుకువచ్చారంటూ ఆయన గతంలో సీఐడీ కి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులను ఆశ్రయించారు.

ఈ భూముల లావాదేవీలలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, రైతులు స్వచ్ఛందంగానే ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చారని స్పష్టం చేస్తూ గతంలోనే ఏపీ హైకోర్టు ఈ కేసులను కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా, సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది. పిటిషనర్ దాఖలు చేసిన ఆరోపణలలో ఎలాంటి బలమైన ఆధారాలు లేవని పేర్కొంటూ, వైసీపీ నేత దాఖలు చేసిన అన్ని పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Also Read : అమరావతి అసెంబ్లీలో స్వాతంత్ర్య సంబరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది ఒక లీగల్ పాలసీ ప్రకారమే జరిగిందని కోర్టులు స్పష్టం చేయడంతో కూటమి ప్రభుత్వ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ఐదేళ్లుగా అమరావతిపై వైసీపీ చేసిన ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ మరియు భూముల అక్రమాల ఆరోపణలన్నీ కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యలేనని ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులకు లీగల్ పరంగా ఉన్న పెద్ద అడ్డంకి పూర్తిగా తొలగిపోయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఎన్టీఆర్ అభిమాని కొడుక్కి...

తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ భక్తి...

గ్లోబల్ స్టేజీపై అమరావతి...

భారతదేశ అర్బన్ ప్లానింగ్ చరిత్రలోనే అత్యంత...

అమరావతి అసెంబ్లీలో స్వాతంత్ర్య...

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలందరినీ...

అమరావతి సీడ్ యాక్సెస్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి రవాణా...

అమరావతికి రాచబాట.. సీడ్...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది....

కృష్ణా, గుంటూరు జిల్లాల...

కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని...

పోల్స్