Friday, August 14, 2026 12:00 PM
Friday, August 14, 2026 12:00 PM

గ్లోబల్ స్టేజీపై అమరావతి వైభవం..!

భారతదేశ అర్బన్ ప్లానింగ్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు అతిపెద్ద ప్రయోగంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పత్రిక న్యూయార్క్ టైమ్స్ కొనియాడింది. ‘ఒక వ్యక్తి సంకల్పం – భారతదేశపు అత్యంత నివాసయోగ్యమైన నగర నిర్మాణం’ అనే శీర్షికతో ప్రచురించిన ఈ ప్రత్యేక కథనంలో, పర్యావరణహితంగా, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అమరావతి రూపుదిద్దుకుంటున్న తీరును క్షేత్రస్థాయి పరిశీలనతో సహా వివరించింది.

Also Read : అమరావతి అసెంబ్లీలో స్వాతంత్ర్య సంబరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నగరానికి దక్కిన ఈ గుర్తింపు పట్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంతర్జాతీయ కథనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. అమరావతి కేవలం ఒక గొప్ప రాజధాని నగరం మాత్రమే కాదు, భారతదేశంలోనే సరికొత్త జీవన ప్రమాణాలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పచ్చదనం, సమర్థత, సమ్మిళిత వృద్ధి మరియు ప్రజల దైనందిన జీవన నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ఈ నగరాన్ని డిజైన్ చేసినట్లు సీఎం పేర్కొన్నారు.షూటింగ్ లేకపోయినా సెట్స్ లోనే ప్రభాస్.. ఎందుకు..?

Also Read :

ప్రపంచస్థాయి పట్టణ జీవనం అనేది సుదూర స్వప్నం కాదు, భారతదేశం కూడా దానిని సాధించగలదని అమరావతి ద్వారా నిరూపిస్తామని ఆకాంక్షించారు. న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో అమరావతి ప్రాజెక్ట్ యొక్క విస్తృతిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. దాదాపు 25 వేల మందికి పైగా కార్మికులు రాత్రింబగళ్లు శ్రమిస్తూ, కాలువలు, బైక్ లేన్లు మరియు క్వాంటం వ్యాలీ వంటి అత్యాధునిక సాంకేతిక హబ్‌లతో ఈ కలల రాజధానిని నిర్మిస్తున్నారని పేర్కొంది. రాబోయే 2029 నాటికి ఈ భారీ మౌలిక వసతుల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అంతర్జాతీయ కథనం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు మరియు పారిశ్రామికవేత్తల దృష్టి మరోసారి అమరావతి వైపు ఆకర్షితమౌతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమరావతి అసెంబ్లీలో స్వాతంత్ర్య...

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలందరినీ...

అమరావతి సీడ్ యాక్సెస్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి రవాణా...

అమరావతికి రాచబాట.. సీడ్...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది....

కృష్ణా, గుంటూరు జిల్లాల...

కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని...

కర్నూలులో పొలిటికల్ హీట్.....

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం పరిసర...

గ్రూప్‌ 1 అక్రమాలు...

వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్‌ వన్...

పోల్స్