వైసీపీ డీఎస్సీ ధర్నా.. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్‌లా ఉందని ఆ పార్టీ నుంచి వినిపిస్తున్న ఇన్‌సైడ్ టాక్. జనాన్ని పోగేసి హడావుడి చేశారు కాబట్టి.. ఆందోళన విజయవంతం అయిందని చెప్పుకోక తప్పదు. కానీ జగన్ అండ్ కో ఒప్పుకోలేని, చెప్పుకోలేని నిజం ఏంటంటే.. డీఎస్సీ అక్రమాలపై వైసీపీ చేసిన ఆందోళనలు.. పేషెంట్ లేకుండా చేసిన ఆపరేషన్‌లాంటివి. కారు లేకుండా డ్రైవింగ్ చేసినట్లు నటించినంత మాత్రాన ఎక్కడికీ వెళ్లలేరు. ఉన్నచోటనే డ్రామా చేస్తూ ఎక్కడికో పోయినట్టు బిల్డప్ ఇస్తే ఎలా ఉంటుందో.. అత్యంత పారదర్శకంగా జరిగిన డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ చేసిన నిరసనలు కూడా అలాగే ముగిశాయి.
Also Read : డిప్యూటి సిఎం భార్యపై సంచలన ఆరోపణలు..!
డీఎస్సీలో అవకతవకలు జరిగితే.. ఆ పరీక్ష రాసిన అభ్యర్ధులే పోరాటంలో ముందుంటారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు చేసి ధర్నాలు, ఆందోళనల్లో ఎక్కడా ఒక్క డీఎస్సీ అభ్యర్ధి కూడా కనిపించలేదు. కనీసం జాబ్ చేసే ఏజ్‌లో ఉన్న యువత కూడా రాలేదు. ఫ్యాన్ పార్టీ నాయకులు డబ్బులిచ్చి తీసుకొచ్చిన పెయిడ్ ఆర్టిస్టులు చేసిన దీక్షలకు ప్రజల మద్దతు లేదని తేలిపోయింది.
మరోవైపు డీఎస్సీ నియామకాలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న వైసీపీకి వ్యతిరేకంగా టీచర్లు నిర్వహించిన ఆందోళన సూపర్ హిట్ అయింది. కర్నూలు కొండారెడ్డి బురుజు మీద కదం తొక్కిన టీచర్లు.. ఏళ్ల తరబడి కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన తమ శ్రమను, ప్రతిభను అవమానించవద్దని వేడుకున్నారు. తప్పుడు ఆరోపణలు కొనసాగిస్తే తాడేపల్లి ప్యాలెస్‌ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే.. టీచర్ల ఆందోళనకు పబ్లిక్ పాజిటివ్‌గా రియాక్ట్ అయినట్లు కనిపిస్తోంది.
Also Read : డిప్యూటి సీఎంగా త్రిష..? మాజీ మంత్రి సంచలనం..!
క్వశ్చన్ పేపర్ లేకుండా కంప్యూటర్ విధానంలో జరిగిన డీఎస్సీలో పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ లేదు. స్పోర్ట్స్ కోటాపై చేసిన ఆరోపణలకు ప్రభుత్వం పక్కా ఆధారాలతో ఇచ్చిన వివరణతో వైసీపీకి సౌండ్ లేకుండా పోయింది. సీబీఐ విచారణ కోసం కోర్టుకు వెళ్లినా.. అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా చూపించలేక పోవడంతో.. కేసు డిస్మిస్ అయింది. రాజకీయంగా చర్చకు రావాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సవాల్ చేసినా.. జగన్ నుంచి స్పందన లేదు. సొంత మీడియా ఉంది.. ఇచ్చిన స్క్రిప్ట్ చదివే మనుషులు ఉన్నారని.. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే.. ఈ సోషల్ మీడియా జనరేషన్ నమ్మే అవకాశం లేదు. అందుకే కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్ల ఆందోళన సక్సెస్ అయింది.. రాజకీయం కోసం వైసీపీ చేసిన డీఎస్సీ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయింది.

