Wednesday, August 12, 2026 02:01 PM
Wednesday, August 12, 2026 02:01 PM

శాంతిభద్రతలపై సీఎం నేడు కీలక సమావేశం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్న సిఎం చంద్రబాబు.. నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అత్యంత ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్న నేపధ్యంలో ఆసక్తికర చర్చ మొదలైంది. నేడు మధ్యాహ్నం 03:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ హై లెవల్ మీటింగ్‌కు డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు దాదాపు 1,300 మంది పోలీస్ అధికారులు ప్రత్యక్షంగా మరియు వర్చువల్ విధానంలో హాజరుకానున్నారు.

Also Read : ఢిల్లీ వేదికగా మళ్లీ బీజేపీకి జగన్ జై..!

రాష్ట్రంలో మారుతున్న నేరాల సరళిని అంచనా వేయడానికి, శాంతిభద్రతలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు పోలీస్ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడానికి ఈ భారీ స్థాయి సమావేశం ఒక వేదికగా నిలవనుంది. ఈ కీలక సమావేశంలో ప్రధానంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను అరికట్టడం, అలాగే రోజురోజుకూ విస్తరిస్తున్న సైబర్ క్రైమ్‌ను సమర్థవంతంగా నియంత్రించడంపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తున్న సోషల్ మీడియా సైకోల హల్చల్, బ్లేడ్ బ్యాచ్‌ల వీరంగం, మరియు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి ముఠాల ఆగడాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసులకు పలు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.

Also Read : ప్రకాష్ రాజ్ కు ఎన్నికల సంఘం షాక్..!

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల పనితీరు, నిందితులపై కేసుల నమోదు ప్రక్రియ మరియు దర్యాప్తు పురోగతికి సంబంధించిన క్షేత్రస్థాయి నివేదికలను కూలంకషంగా పరిశీలిస్తూ సీఎం చంద్రబాబు ఈ సమీక్షను ముందుకు తీసుకెళ్లనున్నారు. సమాజంలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటివారైనా సరే వెనకాడకుండా వారిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా మహిళలు, బలహీన వర్గాల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వస్తే తక్షణ న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలని స్పష్టం చేయనున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ప్రకాశ్ రాజ్ ఓటు...

బెంగళూరు నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...

డిప్యూటి సిఎం భార్యపై...

తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి...

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

మార్కాపురం జిల్లాకు కూటమి...

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు...

జూలకంటిని ఇరికించాలని చూసిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా...

పోల్స్