Tuesday, July 21, 2026 10:27 PM
Tuesday, July 21, 2026 10:27 PM

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.. అన్‌స్టాపబుల్..!

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విమానాశ్రయ నిర్మాణంలో చివరి దశ పనులు సైతం పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం కానున్నాయి.

Also Read : వైసీపీ నయా గేమ్ ప్లాన్.. సూపర్ ఫ్లాప్..!

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఆగస్టు 1 ఉత్తరాంధ్ర.. ‘ఉత్తమాంధ్ర’గా నిలిచే ప్రయాణంలో కీలక ఘట్టంగా మారనుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా మద్దతు అందించాలని కోరారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ త్వరలో వెల్లడిస్తామన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ పనుల పురోగతి, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడం ద్వారా ఈ ప్రాంతంలో కొత్త ఆర్థిక, పారిశ్రామిక అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు, పోర్టులు, జాతీయ రహదారులు, పరిశ్రమల మధ్య అనుసంధానం పెరగడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి మరింత వేగం పుంజుకోనుంది. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర ‘అన్‌స్టాపబుల్’గా దూసుకుపోతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విమానాశ్రయంలోని ప్రతి విభాగంలోనూ ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వం ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 1న జరగనున్న ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర విమానయాన రంగంలోనే కాకుండా పర్యాటక, పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిలోనూ సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.

Also Read : తొలిరోజే రణరంగం.. బొమ్మ దద్దరిల్లుతుందా..?

ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఎయిర్‌పోర్టు సమావేశ మందిరంలో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున నేతలు, అధికారులు, ప్రజలు వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ ఎక్కడా ఇబ్బంది రాకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

కాదంబరి జెత్వాని కేసులో...

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై...

పోల్స్