Saturday, July 18, 2026 12:00 AM
Saturday, July 18, 2026 12:00 AM

కూటమిలో లోకల్ వార్ టెన్షన్..!

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్‌డీఏ కూటమి అప్రమత్తమైంది. స్థానిక ఎన్నికల్లో అధికార పక్షానికే అనుకూల ఫలితాలు రావడం సాధారణమే అయినప్పటికీ, చిన్న పొరపాటు కూడా రాజకీయంగా నష్టం కలిగించవచ్చనే అంచనాతో టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగానే మూడు పార్టీల రాష్ట్ర నాయకత్వం సమావేశమై క్షేత్రస్థాయిలో ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.

Also Read : టార్గెట్ 2029.. వైసీపీకి కొత్త రింగ్ మాస్టర్..!

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పాల్గొన్నారు. పార్లమెంట్ లేదా జిల్లా స్థాయిలో ఒక సమన్వయ కమిటీ, అసెంబ్లీ స్థాయిలో మరో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీల్లో మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇన్‌చార్జులు సభ్యులుగా ఉండనున్నారు.

కమిటీలో ఏర్పాటు చేయడం ఒక ఎత్తయితే, స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకం, అధికార భాగస్వామ్యమే అసలు సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు పరిమిత స్థానాలే దక్కినా, వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో ఆ పార్టీ శ్రేణులు కూటమి విజయానికి బలంగా పనిచేశాయి. అయితే రెండేళ్ల పాలన తర్వాత జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం, కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తమకు తగిన ప్రాధాన్యం, గుర్తింపు లేదన్న.. భావనతో పాటు స్థానిక స్థాయిలో పనులు కూడా సజావుగా జరగడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Also Read : అవి అక్రమ కేసులే.. ఆధారాల్లేవ్‌.. చంద్రబాబుకి సుప్రీం క్లీన్‌ చిట్‌..!

ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోతే క్షేత్రస్థాయిలో సమన్వయానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాన్ని రాజకీయ పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓటింగ్ ధోరణి ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన టీడీపీ.. ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉండగానే సమన్వయ వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నం ప్రారంభించింది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేసి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది.

కూటమి ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పదవీకాలం మిగిలి ఉండటంతో మిత్రపక్షాల నాయకులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో కార్యకర్తల వైఖరి.. ఎలా ఉంటుందన్న ఆందోళన మాత్రం కూటమి నాయకత్వాన్ని వెంటాడుతోంది. అందుకే విభేదాలకు అవకాశం లేకుండా వీలైనంత వరకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా చూడాలన్న ఆలోచన కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

స్థానిక ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల పాలకవర్గాల ఎంపిక మాత్రమే కాదు. కూటమి అంతర్గత ఐక్యతకు, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయానికి కూడా ఇవి తొలి పెద్ద పరీక్షగా మారనున్నాయి. కమిటీల ఏర్పాటు కంటే క్షేత్రస్థాయిలో అసంతృప్తిని తగ్గించి మూడు పార్టీల కార్యకర్తలను ఒకే దారిలో నడిపించగలిగితేనే కూటమి ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. లేదంటే స్థానిక ఎన్నికల ఫలితాలు వచ్చినా, అవి రాజకీయంగా దీర్ఘకాలిక బలాన్ని నిర్ధారిస్తాయని చెప్పలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

క్రికెట్ చరిత్రలో ఓ...

క్రికెట్ చరిత్రలో ఓ మహోన్నత అధ్యాయానికి...

టార్గెట్ 2029.. వైసీపీకి...

2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన...

స్థానిక ఎన్నికల్లో వెనక్కి...

ఏపీ లో రాబోయే స్థానిక సంస్థల...

ఇప్పుడైనా ఆ పదవులు...

ఇప్పుడైనా ఆ పదవులు భర్తీ చేస్తారా..?...

అవి అక్రమ కేసులే.....

ఏపీలో జగన్‌ హయాంలో గతంలో ఎన్నడూ...

గల్లా జయదేవ్ కు...

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో...

పోల్స్