Friday, July 3, 2026 05:19 PM
Friday, July 3, 2026 05:19 PM

సార్.. లోకల్ వార్ ఎప్పుడు సార్..?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం రాజకీయంగా పెద్దగా ప్రతిబంధకాలు కనిపించడం లేదు. గ్రామీణ, పట్టణ స్థాయిలో అధికార కూటమికి అనుకూల వాతావరణం ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని అధిక శాతం గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ సంస్థలు, మున్సిపల్ సంస్థల పదవీకాలం ముగియడంతో అవన్నీ ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా నిర్వహించి కింది స్థాయి అధికార వ్యవస్థను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది.

Also Read : భారత్ నుంచి రష్యాకు ఆయిల్.. కారణం అదేనా..?

కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. ప్రభుత్వ సమీక్షల్లో “మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు” అనే సంకేతాలు వస్తున్నప్పటికీ, ఎన్నికల షెడ్యూల్ మాత్రం ప్రకటించటం లేదు. వేసవి కాలంలోనే ఎన్నికలు నిర్వహించి ఉంటే పరిపాలనా పరంగా అనుకూల పరిస్థితులు ఉండేవని అధికారులు కూడా భావించారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా వెళ్లకపోవడం వెనుక రాజకీయ వ్యూహమే ప్రధాన కారణమనే చర్చ జరుగుతోంది. ప్రత్యేకాధికారుల పాలనను మరికొంత కాలం కొనసాగిస్తూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణలు వేగవంతం చేయడం ద్వారా వైసీపీ స్థానిక నాయకత్వాన్ని మరింత రక్షణాత్మక స్థితిలోకి నెట్టాలని ప్రభుత్వం భావిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల సమయానికి ప్రత్యర్థి పార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకుండా చేయాలన్నది అధికార పార్టీ నేతల ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్థానిక ఎన్నికల జాప్యం వెనుక కూటమి అంతర్గత రాజకీయ సమీకరణాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకం పెద్దగా ఇబ్బంది లేకుండా పూర్తయినా, స్థానిక ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ప్రతి గ్రామంలో సర్పంచ్, ప్రతి వార్డులో వార్డు సభ్యుడు, ప్రతి మున్సిపాలిటీలో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ స్థానం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక నేతల మధ్య సహజంగానే పోటీ నెలకొనే అవకాశం ఉంది.

అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడే ప్రమాదం ఉందనే అంచనాతో ముందుగా నామినేటెడ్ పదవుల పంపిణీ పూర్తి చేసి, అసంతృప్తిని తగ్గించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కూటమి పెద్దలు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై ప్రభావం చూపుతున్న అంశాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సంక్షేమ పథకాల అమలు, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.

Also Read : మావిగన్ సరే.. మరి విశాఖ మాటేమిటి..?

ఈ దశలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం పనితీరు మందగించే అవకాశం ఉంది. అందుకే ముందుగా అభివృద్ధి. సంక్షేమ కార్యక్రమాల ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. వాటి ద్వారా రాజకీయంగా మరింత బలం పెంచుకున్న తర్వాత ఎన్నికలకు వెళ్లడం అధికార పార్టీ నేతల వ్యూహంగా కనిపిస్తోంది. రాజకీయ నిర్ణయాల్లో తొందరపడని నాయకుడిగా పేరున్న చంద్రబాబు నాయుడు.. ప్రత్యర్థి మరింత బలహీనపడే వరకు, కూటమిలో పూర్తి స్థాయి సమన్వయం ఏర్పడే వరకు వేచి చూడాలనే ధోరణిలో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

బడ్జెట్ ప్రక్రియ, నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తయిన తర్వాత ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలన ద్వారానే గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వ పాలన, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే కూటమి లక్ష్యంగా కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం...

ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను కేంద్ర...

సాయికృష్ణ మృతి కేసులో...

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ...

మావిగన్ సరే.. మరి...

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్...

వాట్సాప్ కొత్త ఫీచర్‌...

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల...

లేటుగా గుర్తొచ్చిన ముద్రగడ.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

సీఎంఓ‌లోకి మరో జగన్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వైసీపీ అభిమాన...

పోల్స్