వెనిజులాలో సంభవించిన ఘోర భూకంపం నుండి మిలియన్ల మంది ప్రజలను వారి జేబుల్లోని ఆండ్రాయిడ్ ఫోన్లు కాపాడాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. అక్కడ ప్రభుత్వ పరంగా ఎలాంటి ముందస్తు హెచ్చరికల వ్యవస్థ లేదు. కానీ, భూమి కంపించడానికి కొన్ని సెకన్ల ముందే గూగుల్ పంపిన లౌడ్ అలర్ట్ మెసేజ్ చూసి ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. స్మార్ట్‌ఫోన్లలో ఉండే యాక్సిలెరోమీటర్.. అనే చిన్న సెన్సార్ ద్వారా గూగుల్ ఈ అద్భుతాన్ని సాధ్యం చేసింది.
Also Read : వైసీపీలో చేరబోతున్న టీడీపీ ఎమ్మెల్యే..!
భూకంపం వచ్చేటప్పుడు మొదట వచ్చే సూక్ష్మమైన వైబ్రేషన్లను ఈ సెన్సార్ గుర్తిస్తుంది. వెంటనే ఆ సిగ్నల్ ను గూగుల్ సర్వర్లకు పంపుతుంది. ఒకే ఏరియా నుండి వేలాది ఫోన్లు ఇలాంటి సిగ్నల్స్ పంపగానే.. అక్కడ భూకంపం వస్తోందని గూగుల్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ప్రమాదకరమైన భూకంప తరంగాలు ఆ ఏరియాను తాకడానికి ముందే.. కాంతి వేగంతో చుట్టుపక్కల ఉన్న మిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ క్షణాల్లో లౌడ్ అలర్ట్స్ పంపేస్తుంది. జపాన్, అమెరికా లాంటి దేశాల్లో కోట్లాది రూపాయల ఖరీదైన ప్రభుత్వ అలర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి.
Also Read : బీజేపిలో యూపి ఫార్ములా.. ఆ కేంద్ర మంత్రులు అవుట్..?
కానీ అలాంటి సాంకేతికత లేని వెనిజులా లాంటి దేశాల్లో గూగుల్ ఆండ్రాయిడ్ నెట్‌వర్క్ పేద ప్రజల ప్రాణాలను కాపాడే ఒక కవచంగా మారింది. మీ మొబైల్‌లో కూడా ఈ భద్రతా ఫీచర్‌ను ఆన్ చేసుకోవడం చాలా సులువు. అందుకోసం మీ ఆండ్రాయిడ్ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి, అందులో Safety & Emergency లేదా Location ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే Earthquake Alerts ఫీచర్ ను ఆన్ చేసి ఉంచుకుంటే.. భవిష్యత్తులో మన ఏరియాలో ఏదైనా భూకంపం వచ్చే అవకాశం ఉంటే మీ ఫోన్ సెకన్ల ముందే మిమ్మల్ని హెచ్చరించి మీ ప్రాణాలను కాపాడుతుంది.

