ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన ఇబ్బందులు మరింత తీవ్రమవుతున్నాయి. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన పాత కేసులో విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో నిబంధనలను ఉల్లంఘించి, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై ప్రాసిక్యూషన్.. జరిపేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
Also Read : వెంకి, కళ్యాణ్ రామ్ లతో హిట్ మెషిన్ అనిల్ రావిపూడి సిద్ధం..!
2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, అలాగే అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుపై కొడాలి నాని తీవ్రస్థాయిలో దూషణలకు దిగారు. ఆ సమయంలో మంత్రి హోదాలో ఉన్న కొడాలి నాని ‘ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్’ అంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించారని పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ వ్యవహారంపై 2021 ఫిబ్రవరి 16వ తేదీన కృష్ణా జిల్లా గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది.
Also Read : నల్లపరెడ్డికి చుక్కలు చూపించిన ఆడపులి..!
సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ కేసును ప్రస్తుత ప్రభుత్వం నిశితంగా పరిశీలించింది. కొడాలి నాని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడంతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు దర్యాప్తులో నిర్ధారణ కావడంతో, ప్రభుత్వం ఈ ప్రాసిక్యూషన్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో కొడాలి నానిపై న్యాయస్థానంలో విచారణ వేగవంతం కానుంది. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

