Saturday, May 23, 2026 07:13 PM
Saturday, May 23, 2026 07:13 PM

అక్కడ మాజీ మంత్రికే పలుకుబడి..!

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలే నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీ నేతలదే నియోజకవర్గాల్లో హవా. పార్టీ అధికారంలో ఉండి.. అభ్యర్తి ఓడిపోయినా సరే.. అధికారులు మాత్రం.. ఆ ఓడిన అభ్యర్థికే సలాం కొడతారు. ఇది తీరు తొలి నుంచి జరుగుతుంది. నియోజకవర్గాల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ గెలిచిన ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో ఓడిన అభ్యర్థులు పెత్తనం చేస్తున్నారని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కానీ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. అక్కడ గెలిచింది అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఇప్పటికీ ఓడిన మాజీ మంత్రి మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నారు.

Also Read : చంద్రబాబుతో ఏపీ బిజేపి చీఫ్.. ఆ ఒక్కటి నాకే ప్లీజ్..? 

ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత. నరసన్నపేట నియోజకవర్గం నుంచి 1989, 1999 ఎన్నికల్లో గెలిచారు. తొలిసారే మంత్రిపదవి దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచి పరిచయాలు ఉన్న నేత. 2004 నుంచి ఆయన తన మకాం శ్రీకాకుళం అసెంబ్లీకి మార్చేశారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్తి గోండు శంకర్ చేతిలో ఓడినప్పటికీ.. నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికీ ధర్మాన హవానే కొనసాగుతోంది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన పక్కా ఇళ్లను లబ్దిదారులకు ఎమ్మెల్యేకు బదులుగా ఓడిన మాజీ మంత్రి కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రెండు రోజుల క్రితం శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేటలో మత్స్యకారులకు ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ధర్మాన ప్రసాదరావు దగ్గరుండి గృహప్రవేశాలు చేయించారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో కూడా మాజీ మంత్రి ధర్మాన పాల్గొన్నారు. నిజానికి ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత నిధులతో నిర్మించినవి కాదు.. పోనీ.. ఏ దాత కానీ.. సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ నిర్మించినవి కాదు. పూర్తిగా ప్రభుత్వ నిధులతో కట్టినవే. వీటిని అధికారికంగా ప్రారంభించాలంటే అందుకు ప్రభుత్వ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ ధర్మాన విషయంలో మాత్రం అవేవీ వర్తించవన్నట్లుగా అధికారుల తీరు కనిపిస్తోంది.

హుద్ హుద్ తుఫాన్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన వారికి అప్పటి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. లబ్దిదారుల ఎంపిక మొదలు.. అంతా 2014 టీడీపీ సర్కార్ హయాంలోనే జరిగింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఆ ఇళ్లను పూర్తి చేయటంలో నిర్లక్ష్యం వహించింది. పైగా అసలైన లబ్దిదారులకు కేటాయింపు జరగలేదంటూ కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు వైసీపీ నేతలు. దీంతో ఇళ్ల కేటాయింపునకు బ్రేక్ పడింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. దీంతో తుఫాన్ వల్ల నష్టపోయిన కుటుంబాలు.. ఆ ఇళ్లు తమకే వస్తాయని గంపెడాశ పెట్టుకున్నారు. కానీ ధర్మాన రంగప్రవేశంతో వారి ఆశలన్నీ నీరు గారిపోయాయి.

Also Read : బ్రేకింగ్: ఇద్దరు ఎమ్మెల్యేలకు పవన్ పిలుపు.. యాక్షన్ కు రంగం సిద్దం..?

సడన్‌గా కుందువానిపేటకు వచ్చిన ధర్మాన ప్రసాదరావు.. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లలోకి తమ పార్టీకి అనుకూలమైన వారితో గృహప్రవేశాలు చేయించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో కూడా ధర్మాన పాల్గొన్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. అవి ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్లు.. వాటిని ప్రారంభించాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. గృహప్రవేశం చేస్తుంది అసలైన లబ్దిదారులా.. కాదా.. అనే విషయం కూడా అంతా పరిశీలించాలి. కానీ ధర్మానకు మాత్రం అవేవీ వర్తించవు. ఆయన ఏం చేయాలనుకుంటే.. అది జరిగిపోవాల్సిందే. అటు అధికారులు, ఇటు కూటమి నేతలు కూడా ఈ విషయంలో ఇప్పటి వరకు నోరెత్తలేదు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన పక్కా ఇళ్లను తమ పార్టీకి చెందిన సానుభూతిపరులకు కేటాయించడమే కాక.. ఆయనే దగ్గరుండి మరీ గృహప్రవేశాలు చేయించారంటే.. ధర్మాన ప్రసాదరావు హవా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బెజవాడ కాదు… ఇది...

రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి.. మృగశిర...

బెజవాడ థార్ గొడవ...

విజయవాడ నడిరోడ్డుపై జరిగిన థార్ కార్ల...

బ్రేకింగ్: ఇద్దరు ఎమ్మెల్యేలకు...

జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల...

ట్రంప్ పిచ్చి తట్టుకోలేకే...

అమెరికా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం...

చంద్రబాబుతో ఏపీ బిజేపి...

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి....

ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్...

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఏపీలో...

పోల్స్