Wednesday, May 20, 2026 08:32 PM
Wednesday, May 20, 2026 08:32 PM

ఒక్క ఛార్జ్‌తో 440 కిలోమీటర్ల రేంజ్.. స్కోడా అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎస్యూవీ..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా, గ్లోబల్ మార్కెట్‌ లో తన అత్యంత చిన్న, సరసమైన ఎలక్ట్రిక్ కారు ఎపిక్ ప్రొడక్షన్ మోడల్‌ ను అధికారికంగా ఆవిష్కరించింది. స్కోడా ఎలక్ట్రిక్ లైనప్‌ లో ఎల్రోక్ కారు కంటే దిగువన రాబోతున్న ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీని కంపెనీ మోడ్రన్ సాలిడ్ డిజైన్ లాంగ్వేజ్‌ తో రూపొందించింది. బోనెట్‌ పై ఆకర్షణీయమైన ‘SKODA’ అక్షరాలతో పాటు గ్లోస్-బ్లాక్ గ్రిల్ ప్యానెల్, ఎల్-షేప్డ్ ఎల్ఈడీ హెడ్‌ ల్యాంప్స్, స్పోర్టీ లుక్ ఇచ్చే సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ తో ఈ కారు ఫ్రంట్ ప్రొఫైల్ ఎంతో స్టైలిష్‌ గా కనిపిస్తోంది.

Also Read : మార్కెట్లోకి బ్రెజా.. అదిరిపోయే ఫీచర్లతో ఎంట్రీ..!

దాదాపు 4,171 మిమీ పొడవు, 2,601 మిమీ వీల్‌ బేస్ కలిగిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ లోపల విశాలమైన క్యాబిన్‌ ను అమర్చారు. ఆండ్రాయిడ్ ఆధారిత 13-ఇంచుల భారీ టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, వైర్‌ లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌ రూఫ్ మరియు 10-స్పీకర్ల కాంటన్ ఆడియో సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే.. 7 ఎయిర్‌ బ్యాగ్‌ లు, 360-డిగ్రీ కెమెరాతో పాటు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టెక్నాలజీని కూడా స్కోడా ఈ చిన్న ఈవీలో అందించడం విశేషం.

Also Read : స్కోడా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ మోడళ్లపై రూ.3.5 లక్షల వరకు..!

వోక్స్‌ వ్యాగన్ గ్రూప్ MEB+ ప్లాట్‌ ఫారమ్‌ పై తయారైన స్కోడా ఎపిక్.. 38.5kWh, 55kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభించనుంది. ఇందులో చిన్న బ్యాటరీ వేరియంట్ ఒక్క ఛార్జ్‌ పై 310 కిమీ రేంజ్ ఇస్తుండగా, పెద్ద బ్యాటరీ కలిగిన టాప్-స్పెక్ మోడల్ ఏకంగా 440 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, డిసి ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో ఈ కారు కేవలం 24 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే లాంచ్ కానున్న ఈ ఈవీ, భారత మార్కెట్లోకి వస్తే టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV400 వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

పోల్స్