ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా, గ్లోబల్ మార్కెట్ లో తన అత్యంత చిన్న, సరసమైన ఎలక్ట్రిక్ కారు ఎపిక్ ప్రొడక్షన్ మోడల్ ను అధికారికంగా ఆవిష్కరించింది. స్కోడా ఎలక్ట్రిక్ లైనప్ లో ఎల్రోక్ కారు కంటే దిగువన రాబోతున్న ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీని కంపెనీ మోడ్రన్ సాలిడ్ డిజైన్ లాంగ్వేజ్ తో రూపొందించింది. బోనెట్ పై ఆకర్షణీయమైన ‘SKODA’ అక్షరాలతో పాటు గ్లోస్-బ్లాక్ గ్రిల్ ప్యానెల్, ఎల్-షేప్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, స్పోర్టీ లుక్ ఇచ్చే సిల్వర్ స్కిడ్ ప్లేట్ తో ఈ కారు ఫ్రంట్ ప్రొఫైల్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది.
Also Read : మార్కెట్లోకి బ్రెజా.. అదిరిపోయే ఫీచర్లతో ఎంట్రీ..!
దాదాపు 4,171 మిమీ పొడవు, 2,601 మిమీ వీల్ బేస్ కలిగిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ లోపల విశాలమైన క్యాబిన్ ను అమర్చారు. ఆండ్రాయిడ్ ఆధారిత 13-ఇంచుల భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, వైర్ లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్ రూఫ్ మరియు 10-స్పీకర్ల కాంటన్ ఆడియో సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే.. 7 ఎయిర్ బ్యాగ్ లు, 360-డిగ్రీ కెమెరాతో పాటు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టెక్నాలజీని కూడా స్కోడా ఈ చిన్న ఈవీలో అందించడం విశేషం.
Also Read : స్కోడా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ మోడళ్లపై రూ.3.5 లక్షల వరకు..!
వోక్స్ వ్యాగన్ గ్రూప్ MEB+ ప్లాట్ ఫారమ్ పై తయారైన స్కోడా ఎపిక్.. 38.5kWh, 55kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభించనుంది. ఇందులో చిన్న బ్యాటరీ వేరియంట్ ఒక్క ఛార్జ్ పై 310 కిమీ రేంజ్ ఇస్తుండగా, పెద్ద బ్యాటరీ కలిగిన టాప్-స్పెక్ మోడల్ ఏకంగా 440 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, డిసి ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో ఈ కారు కేవలం 24 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే లాంచ్ కానున్న ఈ ఈవీ, భారత మార్కెట్లోకి వస్తే టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV400 వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

