రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసాడు. ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగి, ఎవరికీ సాధ్యంకాని ఓ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్క ఫ్రాంచైజీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి 5,500 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్ గా విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు.
Also Read : ప్లేఆఫ్స్ రేసును చెడగొడుతున్న ముంబై, లక్నో..!
శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాలు ఓపెనర్లుగా 5,500 మైలురాయిని దాటినప్పటికీ.. వారు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. కానీ కోహ్లీ మొదటి నుండి ఒకే జట్టుకు ఆడుతూ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం ఒకే రికార్డుతో ఆగలేదు. ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ పై తాను చేసిన 1,174 పరుగుల రికార్డును అతనే బద్దలు కొడుతూ.. పంజాబ్ కింగ్స్‌పై ఏకంగా 1,217 పరుగుల మార్కును దాటి అగ్రస్థానంలో నిలిచాడు.
Also Read : 2027 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఆడతాడా..?
ఈ జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 1,172 పరుగులతో తానే ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ పై 1,161 పరుగులతో రోహిత్ శర్మ నిలిచాడు. ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ స్థిరత్వానికి ఈ రికార్డులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకే ఐపీఎల్ సీజన్ లో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించడం కోహ్లీకి ఇది 9వ సారి. ఐపీఎల్ చరిత్రలో మరే బ్యాటర్ కు ఇన్ని సార్లు 500పైగా రన్స్ చేసిన రికార్డ్ లేదు. ఈ రేసులో డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ చెరో 7 సీజన్లతో కోహ్లీ వెనుక ఉన్నారు. అంతేకాకుండా, వరుసగా 4వ ఐపీఎల్ సీజన్ అంటే 2023 నుండి 2026 వరకు 500 ప్లస్ పరుగులు పూర్తి చేసిన మూడో భారతీయ బ్యాటర్ గా నిలిచాడు.

