తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇదే విషయంపై ఇప్పటికే ఆ పార్టీ అధినేత, నటుడు విజయ్ గవర్నర్‌కు లేఖ కూడా రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు రెండు వారాల గడువు కావాలని లేఖలో కోరారు. మరోవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తన పదవికి రాజీనామా చేసి.. లేఖను గవర్నర్‌కు పంపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు స్టాలిన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారు. అయితే తమిళనాడులో విజయ్ గెలుపును ఏపీ రాజకీయాలతో ముడి పెడుతున్నారు కొందరు. ఇంకా చెప్పాలంటే మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతూ.. తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారు.
Also Read : నిజంగా కేసీఆర్ కు పుడితే.. బండి సంజయ్ సంచలనం..!
పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే విజయ్ పార్టీ టీవీకే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సరిగ్గా పది స్థానాలు కావాల్సి ఉంది. దీంతో 2 వారాల గడువు కోరారు. అయితే వైసీపీ నేతలు మాత్రం.. విజయ్ గెలుపును తమ ఖాతాలో వేసుకుంటున్నారు. అలాగే విజయ్‌ను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావుతో పోల్చుతున్నారు. నిజానికి 1982లో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ఎన్టీఆర్.. కేవలం 9 నెలల్లోనే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్‌తో కమ్యూనిస్టు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.. అంతే తప్పు పొత్తు కోసం ఎన్టీఆర్ ప్రయత్నం చేయలేదు.
Also Read : బాబు రికార్డు అన్ బ్రేకబుల్..!
కానీ వైసీపీ నేతలు మాత్రం.. జగన్ మాదిరిగా విజయ్ సింగల్‌గా పోటీ చేశాడని.. ఎన్టీఆర్, చంద్రబాబు మాదిరి పొత్తులు పెట్టుకోలేదని ఎలివేషన్స్ ఇస్తున్నారు. అయితే దీనికి టీడీపీ అభిమానులు ఘాటుగానే బదులిస్తున్నారు. 1994, 1999 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓడిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓటమి భయంతోనే 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని.. ఆ ఎన్నికల్లో పులివెందులలో జగన్ తండ్రి వైఎస్ఆర్ గెలుపు కోసం ప్రచారం చేసిన విషయం గుర్తు లేదా అని నాటి ఫోటోలను పోస్టు చేస్తున్నారు.
ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే.. ఆయన స్థాయి కూడా మర్చిపోయి సోషల్ మీడియాలో విచిత్రమైన పోస్టులు పెట్టి.. ఆయన లేకితనాన్ని మరోసారి ప్రదర్శిస్తున్నారు. నేడు స్టాలిన్ -ఉదయనిధి స్టాలిన్.. రేపు నారా చంద్రబాబు – లోకేష్ అంటూ కామెంట్ చేశారు. అలాగే సాహసమే విజయాన్ని ఇస్తుంది.. అంటూ పవన్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇక మిగిలిన వైసీపీ నేతలు కూడా విజయ్ ధైర్యంగా జగన్ మాదిరిగా సింగిల్‌గా పోటీ చేశారని.. కానీ ఆ ధైర్యం పవన్‌కు లేదని.. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అలాగే విజయ్, జగన్ కలిసిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
Also Read : వారసులు.. వన్ టైమ్ సీఎం..!
వైసీపీ నేతలకు జనసేన, టీడీపీ నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. విజయ్‌కు సరిగ్గా 11 సీట్లు తక్కువయ్యాయని.. ఆ 11 మంది ఏపీ నుంచి వెళ్లిపోతే.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు అసెంబ్లీకే రాని 11 మంది ఏపీలో చాలా ఖాళీగా ఉన్నారని.. వాళ్లంతా తమిళనాడులో విజయ్ కు మద్దతు ఇస్తారులే అని పోస్టులు చేస్తున్నారు. ఇక మరికొందరైతే.. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అందుకే ఓడిపోయాడా.. అని సెటైర్లు వేస్తున్నారు. 2029లో విజయ్ గెలిచినట్లుగా జగన్ గెలుస్తాడని వైసీపీ నేతలంటుంటే.. ఈసారి ఆ 11 కూడా రావులే అని టీడీపీ, జనసేన నేతలు కామెంట్లు చేస్తున్నారు.

