Tuesday, May 5, 2026 12:40 PM
Tuesday, May 5, 2026 12:40 PM

కాషాయ భారతం.. కమల వికాసం..!

దేశం బీజేపీ వశం అవుతోంది. కమలం వికసిస్తోంది. కాషాయ దళం అనుకున్నది సాధిస్తోంది. విజయ పరంపరను కొనసాగిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాల వ్యూహాలతో కమలం దూసుకుపోతోంది. కంచుకోటలను బద్దలు కొడుతూ.. రాష్ట్రాల్లో కాషాయ జెండాను ఎగురవేస్తోంది. పదేళ్ల కాలంలోనే.. దేశంలో మూడున్నర దశాబ్దాల పాటు తిరుగు లేకుండా అధికారం చలాయించిన కాంగ్రెస్‌ పార్టీని వెనక్కినెట్టింది కమలం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అధికారం శ్వాసిస్తూ శాసించిన ఖద్దర్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తోంది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు, కూటమితో కూడిన రాష్ట్రాలతో దేశం నిండిపోయింది. ఈ రోజున ఈశాన్య భారతంతో పాటు తూర్పు భారతం అంతా బీజేపీ చేతిలోకి వచ్చింది.

Also Read : నటన కోసం డిగ్రీ వదిలేసి.. సీఎం అయ్యాడు..!

అంగ వంగ కళింగ రాష్ట్రాలు అన్నీ కలమ నీడలోకి వచ్చేసినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ విజయం సాధించి తన సత్తాను చాటింది. తమిళనాడులో కూడా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి రావాలంటే.. మరో పార్టీ సాయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. బీహార్ నుంచి మొదలుపెడితే సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, అసోం, త్రిపుర మీదుగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వరకు కాషాయం పార్టీ విస్తరణ చాలా వేగంగా దూకుడుగా సాగింది.

గట్టిగా చెప్పాలంటే కేవలం పదేళ్ల కాలంలోనే ఇదంతా జరిగింది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు అలాగే మిత్రులతో కూడిన రాష్ట్రాలతో దేశం నిండిపోయింది. అంతే కాదు తూర్పు భారతంలో ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాలు కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ట్రాలే కనిపిస్తున్నాయి. మరోవైపు ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ వంటివి బీజేపీ పాలనలో ఉన్నాయి. అలాగే పశ్చిమ భారతంలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా వంటివి బీజేపీ చేతిలోకి వచ్చేశాయి. దేశం నడిబొడ్డున ఉన్న మధ్యప్రదేశ్ కూడా రెండు దశాబ్దాలుగా బీజేపీ పాలనలోనే ఉంది. ఇలా చూస్తే బీజేపీ దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత రాష్ట్రాల్లో అత్యధికం సొంతం చేసుకుంది.

Also Read : కేరళం.. యూడీఎఫ్ హిట్.. ఎల్‌డీఎఫ్ అవుట్..!

ఈ నేపథ్యంలో బీజేపీకి ఉన్న ఏకైక అసంతృప్తి ఏమిటి అంటే దక్షిణాదిన ఇంకా కమల వికాసం జరగలేదు. తమిళనాడులో టీవీకే రూపంలో విజయ్ అధికారం అందుకోబోతున్నారు. అలాగే కేరళలో కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటక, తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2028 ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణాలను గెలుచుకోవాలని బీజేపీ సౌత్ మిషన్‌తో ఉంది. ఇక కేరళ, తమిళనాడులో బీజేపీ వికాసం అంటే ఇప్పట్లో కొంచెం కష్టమే అని చెప్పాల్సి ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వారసులు.. వన్ టైమ్...

అవును వాళ్లంతా వారసులు.. ప్రజల్లో తమకంటూ...

గుంటూరు గడ్డపై మరో...

గుంటూరు జిల్లా రైతాంగానికి కూటమి ప్రభుత్వం...

బ్రేకింగ్: ప్రభుత్వం ఏర్పాటు...

తమిళనాడు రాజకీయ యవనికపై దళపతి విజయ్...

బెంగాల్‌.. కమల వికాసం.....

మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించిన ఐదు...

ఓటమి దిశగా ముగ్గురు...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌...

విజయ్‌‍కు ఏఐఏడీఎంకే మద్దతు...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు...

పోల్స్