Saturday, May 2, 2026 02:55 PM
Saturday, May 2, 2026 02:55 PM

రష్మీని టార్గెట్ చేసిన వైసీపీ..!

యాంకర్ రష్మీ గౌతమ్‌ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా బూతులతో రెచ్చిపోతున్నారు. మహిళ అనే కనీస విచక్షణ అని కూడా చూడకుంటా.. నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. అసలు ఆమె చెప్పారనే విషయం కూడా మర్చిపోయి.. ఆమెపై ఎదురు దాడి చేస్తున్నారు. అయితే రష్మీ కూడా ఏ మాత్రం భయపడటం లేదు. వెనుకడుగు వేయటం లేదు. ప్రతి ఒక్క వైసీపీ సైకోకు ధీటుగా, ఘాటుగా జవాబిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రష్మీకి మద్దతుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : హోటల్ తిండి సామాన్యుడికి ఇక గగనమే..?

రెండు రోజుల క్రితం వైసీపీ నేతలు ఏపీలో ధర్నా నిర్వహించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతకు కూటమి ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఆందోళలు, ర్యాలీ చేశారు. ఇందులో భాగంగా తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన చేశారు. ఆటోను ఎండ్ల బండిపైకి ఎక్కించి ర్యాలీ చేశారు. అదే బండి మీద మరో నలుగురు కూడా ఎక్కారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై రష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు. సహజంగా జంతు ప్రేమికురాలైన రష్మీ.. సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు.

ఎద్దుల బండి పైకి ఎక్కిన వారికి కూడా అదే గతి పడుతుందంటూ రష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆ ఎద్దు పడిన వేదన వారికి వెయ్యి రెట్లు జరగాలని రష్మీ కామెంట్ చేశాారు. పెటా ఇండియా, యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఈ విషయాన్ని పరిశీలించి.. కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో మరెవరూ ఇలా చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రష్మీ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. దీంతో వైసీపీ నేతలు రష్మీని టార్గెట్ చేశారు. “నీకు అంత దురదగా ఉంటే పోయి జనసేన పార్టీ జెండా కప్పుకుని ఊడిగం స్టార్ చేసినట్టు నువ్వు కూడా భజన చేసుకో.. ఆ పనికిమాలిన నాగబాబు చెప్పడం.. నువ్వు పోస్ట్ పెట్టడం.. కళ్లు ఉన్నాయా? దొబ్బాయా ? రష్మీ.” అంటూ రెచ్చిపోతున్నారు. “చాలా బాగా మాట్లాడావు కానీ.. తిరుపతి గోశాలలో ఆవులు చనిపోతే ఎందుకు మాట్లాడలేదు..?” అని ప్రశ్నిస్తున్నారు.

Also Read : మద్యం సేవించి సభకు వచ్చిన సీఎం..?

ఇక వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం కార్యదర్శి డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి కూడా రష్మీ పోస్టును తప్పుబట్టారు. “మీరు అసలు విషయాన్ని పక్కదోప పట్టిస్తున్నారని.. ఎద్దులు బరువులను లాగగలవు, ఇది సమాజంలో కొత్త విషయమేమీ కాదు. దయచేసి ఈ విషయం మీకు తెలియదన్నట్లుగా ప్రవర్తించకండి. అంతేకాకుండా, రాజకీయాల్లో ఉన్న వ్యక్తులను విమర్శించే బదులు, జంతువుల గురించి చర్చించేటప్పుడు మరింత స్పష్టంగా మాట్లాడండి. మీ వాదనలో పసను చేర్చండి, మిమ్మల్ని మీరు అపహాస్యం చేసుకోకండి. చివరగా, వృద్ధాశ్రమాలు లేదా ఇతర సంబంధం లేని విషయాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదు.” అంటూ వార్నింగ్ మెసేజ్ ఇచ్చారు.

అయితే వైసీపీ నేతలు, అభిమానుల పోస్టులకు రష్మీ ఘాటుగా బదులిస్తున్నారు. ముందు అక్కడున్న ఎద్దు ముక్కుకు కట్టిన తాడును విప్పమని అడగగలరా.. అని ప్రశ్నించారు. ఈ పశువులు ఎంత నొప్పిని, అసౌకర్యాన్ని అనుభవిస్తాయో మనం ఊహించలేము. మనం చేయగలిగిన కనీస సహాయం ఇది. ఈ జంతువులు మనకోసం ఇంత చేస్తున్నప్పుడు.. మనం కనీసం వాటికి ప్రాథమిక సదుపాయాలు అయినా కల్పించాలి. వాటిని ప్రచారానికి వాడుకుంటున్నప్పుడు, మనం చేయగలిగిన కనీస పని ఏమిటంటే, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం. ఒక్కసారి మాత్రమే ఆహారం పెట్టడం సరిపోదు. నాకు అసలు రాజకీయ ఆకాంక్షలేమీ లేవు. జంతు సంక్షేమం కోసం పనిచేయడం నాకు సంతోషాన్నిస్తుంది.” అంటు రష్మీ కౌంటర్ ఇచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన...

టీడీపీ ఎమ్మెల్యే సంచలన...

ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో...

బ్రేకింగ్ : కల్తీ...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో...

బ్రేకింగ్: డిప్యూటి సీఎం...

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు హైదరాబాద్‌లో...

టీటీడీకి పవన్ లేఖ.....

కూటమి ప్రభుత్వం ఏం చేసినా తప్పే.....

బ్రేకింగ్: కృష్ణా జిల్లాలో...

కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో ప్రకృతి...

పోల్స్