Saturday, September 19, 2026 01:06 PM
Saturday, September 19, 2026 01:06 PM

బ్లీచింగ్ ఉచ్చులో పడ్డ టీడీపీ..? వైసీపీ మైండ్ గేమ్ సక్సెస్..!

వైజాగ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ భూమిపూజ జరుపుకోవడం, రైల్వే జోన్ నోటిఫికేషన్ ప్రకటన రావడం, అమరావతి-హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రస్తావన రావడం వంటివి రాష్ట్ర భవిష్యత్తును మార్చే అంశాలు. గత ఐదేళ్ల విధ్వంసం తర్వాత, మళ్లీ పెట్టుబడుల ప్రవాహం మొదలైన ఈ తరుణంలో ఒకరకంగా కూటమి సర్కార్ కు ఇది పాజిటివ్ న్యూస్. అయితే, సోషల్ మీడియాలో వైసీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.

Also Read : ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క..!

చాలా తెలివిగా డైవర్షన్ పాలిటిక్స్‌ కు తెరలేపింది. గతంలో మాదిరిగానే టీడీపీ సోషల్ మీడియాకు ఓ వల వేసింది. విశాఖలో జరుగుతున్న ఈ భారీ అభివృద్ధి కార్యక్రమంపై చర్చ జరగకుండా ఉండేందుకు, గతంలో జరిగిన కొన్ని పాత విషయాలను, పెట్రోల్ నిల్వలకు సంబంధించిన అంశాలను కావాలనే తెరపైకి తెస్తోంది. టీడీపీ సోషల్ మీడియా.. కార్యకర్తలు ఆ ఉచ్చులో పడి, వారికి కౌంటర్లు ఇచ్చే క్రమంలో కరోనా టైంలో జగన్ మాట్లాడిన బ్లీచింగ్, జ్వరం టాబ్లెట్ వంటి పాత వీడియోలను షేర్ చేయడం మొదలుపెట్టారు.

Also Read : కాళేశ్వరంపై పట్టు వదలని రేవంత్.. కీలక సమావేశం..!

ప్రస్తుతం ఉన్న పెట్రోల్ కొరతకు అప్పటికి లింక్ చేయడం మొదలుపెట్టింది వైసీపీ. తాము ఒక అసంబద్ధమైన లాజిక్‌ను తెరపైకి తెస్తే, దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో టీడీపీ కార్యకర్తలు మళ్లీ పాత వీడియోలను, జగన్ పాత కామెంట్లను షేర్ చేస్తారనే క్లారిటీ వైసీపీకి ఉంది. వైసీపీ అనుకున్నదే జరిగి.. టీడీపీ సోషల్ మీడియా గూగుల్ అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈరోజు విశాఖలో జరిగిన గూగుల్ భూమిపూజను, రాబోయే ఐటీ హబ్‌ ను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల గురించి సోషల్ మీడియాలో పెద్దగా బజ్ లేకపోవడం గమానర్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్