Monday, April 27, 2026 07:01 PM
Monday, April 27, 2026 07:01 PM

నిన్న పవన్.. నేడు బాబు.. స్టాండప్ కామెడీ పేరుతొ అవమానం..!

స్టాండప్ కామెడీ పేరుతో వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇటీవల తరచుగా వివాదాలకు దారితీస్తోంది. వినోదం కోసం ప్రారంభమైన ఈ కళారూపం, కొన్నిసార్లు వ్యక్తిగత దూషణలు మరియు రాజకీయ నాయకులపై అవమానకర వ్యాఖ్యల వేదికగా మారడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇద్దరు ప్రముఖ నేతలను కేంద్రంగా చేసుకుని జరిగిన రెండు ఘటనలు ఈ అంశాన్ని మరోసారి చర్చకు తెచ్చాయి.

కొద్ది రోజుల క్రితం ఓ స్టాండప్ కమెడియన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. ఆ ఫిర్యాదు ఆధారంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఆ వివాదం ఇంకా చల్లారకముందే, ఇప్పుడు మరో స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ చేసిన పాత వ్యాఖ్యలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పై రెండేళ్ల క్రితం శరత్ ఉదయ్ తన స్టాండప్ కామెడీ షోలో చేసిన వ్యాఖ్యలు టీడీపీ మద్దతుదారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ముఖ్యంగా 2003లో చంద్రబాబుపై జరిగిన నక్సలైట్ల దాడిని ప్రస్తావిస్తూ ఆయన చేసిన జోక్ అభిమానులను తీవ్రంగా బాధించింది.

Also Read : విశాఖ.. పోర్ట్ టూ డేటా సిటీ..!

2003లో తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న సమయంలో చంద్రబాబు వాహనంపై నక్సలైట్లు క్లైమర్ మైన్స్‌తో దాడి చేశారు. ఆ సమయంలో ఆయన బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో ప్రయాణించడం వల్ల ప్రాణాపాయం తప్పి గాయాలతో బయటపడ్డారు. ఆ ఘటన రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక కీలక సంఘటనగా నిలిచింది. అలాంటి సున్నితమైన విషయాన్ని కామెడీ కోసం ఉపయోగించడం పట్ల అప్పట్లోనే టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వారి డిమాండ్ మేరకు శరత్ ఉదయ్ అప్పట్లో క్షమాపణలు కూడా తెలిపారు. దీంతో ఆ వివాదం ముగిసిపోయిందని అందరూ భావించారు.

అయితే తాజాగా బెంగళూరులోని కోరమంగళలో శనివారం రాత్రి జరిగిన శరత్ ఉదయ్ స్టాండప్ కామెడీ షో సందర్భంగా ఈ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. షో ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రేక్షకుల్లో ఉన్న ఓ వ్యక్తి శరత్ ఉదయ్ వద్దకు వెళ్లి, తాను ఆయన అభిమానినని చెప్పి పరిచయం చేసుకున్నాడు. అనంతరం, గతంలో తమ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కొద్దిసేపటికి మరో ఇద్దరు వ్యక్తులు అతనితో చేరి శరత్ ఉదయ్‌ను నిలదీశారు. తరువాత మరికొందరు కూడా అక్కడికి చేరడంతో వివాదం మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా శరత్ ఉదయ్ తాను అప్పట్లోనే క్షమాపణలు చెప్పినట్లు వివరించినప్పటికీ వారు వినిపించుకోలేదని సమాచారం. చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : డీజిల్ దందా.. సర్కార్‌కు చెడ్డపేరు..!

స్టాండప్ కామెడీ అనేది సమాజాన్ని నవ్విస్తూ ఆలోచింపజేసే ఒక సృజనాత్మక కళ. కానీ ప్రజాదరణ పొందిన వ్యక్తులను అవమానించడం, వ్యక్తిగత దూషణలు చేయడం లేదా బాధాకర సంఘటనలను హాస్యంగా మార్చడం ద్వారా పేరు తెచ్చుకోవడం సరైన మార్గం కాదు. నిజమైన హాస్యం అనేది ఆరోగ్యకరమైన సరదా, సామాజిక పరిశీలన, చమత్కారంతో రావాలి. వ్యక్తులను కించపరచడం కాదు, నవ్వుతో మంచి సందేశం ఇవ్వడం స్టాండప్ కామెడీ లక్ష్యంగా ఉండాలి. భవిష్యత్తులో ఈ రంగం మరింత గౌరవప్రదంగా ఎదగాలంటే కమెడియన్లు బాధ్యతాయుతంగా వ్యవహరించడం అత్యంత అవసరం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విశాఖలో ఇన్ఫోసిస్ మెగా...

వైజాగ్ ఐటీ రంగానికి మరింత జోష్...

శేషాచలం కార్చిచ్చు.. రంగంలోకి...

తిరుపతి పుణ్యక్షేత్రం సమీపంలోని పవిత్ర శేషాచలం...

సజ్జల భార్గవ్ కు...

వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్...

ఏపీలో నరకం చూస్తున్న...

ఆంధ్రప్రదేశ్‌ లో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్...

విశాఖ.. పోర్ట్ టూ...

అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ...

డీజిల్ దందా.. సర్కార్‌కు...

ఆయిల్ కంపెనీలు తాము చేస్తున్న తప్పులను...

పోల్స్