Monday, April 20, 2026 06:18 PM
Monday, April 20, 2026 06:18 PM

‘చేతబడిపై చర్యలు తీసుకోండి.. సీఎస్‌కే పేరుతో ఫేక్ లెటర్..!

మంత్రాలకు చింతకాయలు రాలతాయా..? ఇప్పుడు ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా దెయ్యాలు, భూతాలు, చేతబడి వంటివి ఉన్నాయని నమ్ముతున్నారా..? మనిషికి ఏం కావాలన్నా సరే చిన్న నిమ్మకాయ చేతుల్లో పట్టుకుంటే సరిపోతుందా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. సుమారు 30 ఏళ్ల క్రితం ప్రభుదేవ హీరోగా వచ్చిన సినిమా ప్రేమికుడు. గవర్నర్ ఇంట్లో కాపలా కాస్తున్న ఇద్దరు బ్లాక్ క్యాట్ కమాండోల దృష్టి మళ్లించడానికి ఒక నిమ్మకాయ విసిరేస్తాడు హీరో. అది బాంబు అని ఒకరు.. కాదు క్షుద్రశక్తి అని మరొకరు.. దాని చుట్టూ కూర్చుని పరిశీలిస్తున్న సీన్ ఇప్పటికీ అందరకీ గుర్తే.

Also Read :అయ్యర్ ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి..?: అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!

ఇక అసలు విషయం ఏమిటంటే.. ఆధునిక యుగంలో కూడా చేతబడి, మాయలు అంటూ కొందరు కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. గుప్త నిధులున్నాయని, అనారోగ్య సమస్యలు తీరాలంటే నర బలి ఇవ్వాలని కూడా మాయమాటలు చెబుతున్నారు. ఒక్క మంత్రంతో అన్ని జరిగిపోతాయని చెప్పి మోసం చేస్తారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ టీమ్ 10 రన్స్ తేడాతో గెలిచింది.

అయితే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ అంత సులువుగా గెలవలేదంట. హైదరాబాద్ గెలుపు కోసం అభిమానులు చెన్నై జట్టుపై చేతబడి చేశారనే పుకార్లు ఇప్పుడు నెట్టింట్లో బాగా వినిపిస్తున్నాయి. చెన్నై జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని నిమ్మకాయతో మంత్రాలు చదివిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో శివమ్ దూబే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హైదరాబాద్ అభిమాని ఒకరు స్టాండ్స్‌లో నిమ్మకాయ చేతిలో పట్టుకుని మంత్రాలు చదువుతున్న సమయంలో దూబే బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆ అభిమాని సహా.. పక్కనే ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనిని పక్కనే ఉన్న మరో అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Also Read :తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

సీఎస్‌కేపై ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అభిమాని నిమ్మకాయతో మంత్రాలు చదువుతున్నప్పుడే దూబె వికెట్ పడటంతో.. మంత్రాలకు మ్యాచ్‌లు గెలుస్తాయా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో తర్వాత నెటిజన్లు మరింత జోరు పెంచారు. సదరు హైదరాబాద్ అభిమానిపై చెన్నై జట్టు యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక లేఖ కూడా పోస్ట్ చేశారు. తమ ఆటగాళ్లపై ప్రభావం చూపేలా ప్రేక్షకులు అనుసరించిన ఈ అతీంద్రియ పద్ధతులపై చర్యలు తీసుకోవాలని చెన్నై జట్టు డిమాండ్ చేసినట్లు లేఖలో ఉంది. ‘చేతబడిపై చర్యలు తీసుకోండి’ అంటూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేరుతో ఉన్నది ఫేక్ లెటర్ అని జట్టు యాజమాన్యం తేల్చేసింది. మంత్రాలు, పూజల వీడియోలపై కొందరు ఆకతాయిలు ఓ ఫేక్ లెటర్ సృష్టించారని.. స్పష్టం చేసింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ లెటర్ ఫేక్ అని తేలడంతో నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విజయ్‌ ఆస్తుల పంచాయితీ.....

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే...

బీఆర్ఎస్‌లో ముసలం.. హరీష్...

గులాబీ పార్టీలో ముసలం మొదలైందా..? జీవన్...

షర్మిలపై మాజీ ఎమ్మెల్యే.....

ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి...

అన్నం తింటే భరించలేని...

ఏపీ సిఎం చంద్రబాబు పుట్టిన రోజు...

తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి...

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల విజయానికి...

టార్గెట్ ధర్మాన, బొత్స.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి....

పోల్స్